సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా, మెడ మాత్రం నల్లగా ఉంటుంది.ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
అధిక ఇన్సులిన్ స్థాయిలు ఉత్పత్తి కావడం, ఊబకాయం, హార్మోన్ల హెచ్చు తగ్గులు, థైరాయిడ్, సన్ స్క్రీన్‌ను ఎవైడ్ చేయడం, శరీరంలో అధిక వేడి వంటి రకరకాల కారణాల వల్ల మెడ నలుపు రంగులోకి మారుతుంది.దాంతో ఈ సమస్యను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే మెడ ఎంత నల్లగా ఉన్నా ఇప్పుడు చెప్పబోయే ఒక్క రెమెడీని పాటిస్తే మల్లెపువ్వులా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు పిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్, నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు వేసుకుని లూస్ స్ట్రక్చర్‌లో మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు కాస్త మందంగా అప్లై చేసి ఓ అర గంట పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం తడి వేళ్లతో సున్నితంగా రబ్ చేసుకుంటూ మెడను శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఆపై తడి లేకుండా టవల్‌తో తుడుచుకుని ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని ట్రై చేస్తే గనుక నల్లగా ఉన్న మెడ తెల్లగా, మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.
కాబట్టి, తప్పకుండా ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేసేందుకు ప్రయత్నించండి.