టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) పద్మభూషణ్( Padma Bhushan ) ప్రకటించిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సోషల్ మీడియా వేదికగా బాల బాబాయ్ అంటూ సంబోధిస్తూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.నందమూరి ఫ్యామిలీతో ఉన్న గ్యాప్ ను తగ్గించుకునే దిశగా తారక్ అడుగులు వేయడం సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.
బాలయ్య ఎన్టీఆర్ ను ఇప్పటికైనా క్షమిస్తాడా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ను బాలయ్య తమ కుటుంబంలో కలుపుకొంటే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.
నందమూరి హీరోలు కలిసిమెలిసి ఉండాలని ఈ హీరోల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఎన్టీఆర్ తగ్గాడని బాలయ్య సైతం గతంలో జరిగిన ఘటనలను మనస్సులో పెట్టుకోకుండా కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని వినిపిస్తోంది.
నందమూరి కుటుంబానికి( Nandamuri Family ) సంబంధించిన ముఖ్యమైన ఈవెంట్లలో ఈ మధ్య కాలంలో తారక్ కనిపించిన సందర్భాలు లేవనే చెప్పాలి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.వార్2, డ్రాగన్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను తారక్ సొంతం చేసుకుంటున్నారు.తారక్ తో పని చేయడానికి ఇతర భాషల డైరెక్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నారు.
విశ్రాంతి లేకుండా వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న తారక్ ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ కలిసి కనిపించాలని వీళ్లిద్దరూ కలిసి సినిమాల్లో, షోలలో కనపడాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ కోరిక తీరుతుందేమో చూడాల్సి ఉంది.బాలయ్య సైతం ప్రస్తుతం అఖండ సీక్వెల్ సినిమాతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.నందమూరి బాలకృష్ణ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.