వెంకటేశ్( Venkatesh ) అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.ఈ సినిమా 12 రోజుల్లో ఏకంగా 260 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో షేర్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సీనియర్ హీరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పాలి.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పర్ఫామెన్స్ లకు మంచి మార్కులు పడ్డాయి.
గత 24 గంటల్లో ఈ సినిమాకు సంబంధించి బుక్ మై షోలో మాత్రమే లక్షా 70 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.సెకండ్ వీకెండ్ లో సైతం కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అదరగొడుతోంది.
విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అభిమానులను సైతం అంచనాలకు మించి మెప్పిస్తుండటం గమనార్హం.
సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఫుల్ రన్ లో సులువుగానే 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది.గతేడాది హనుమాన్ మూవీ( Hanuman Movie ) సాధించిన కలెక్షన్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ నిర్మాత దిల్ రాజుకు, ఎస్వీసీ బ్యానర్ కు కీలకం కాగా ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.
ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే 2.6 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ నెల 26వ తేదీన భీమవరంలో ఈ సినిమా సక్సెస్ మీట్ జరుగుతోంది.సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ తో తెలుగులో ఐశ్వర్య రాజేష్( Aishwarya Rajesh ) మరింత బిజీ కావడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దిల్ రాజు క్రేజీ కాంబినేషన్ల కన్నా ఫ్యామిలీ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తే మరిన్ని విజయాలు చేరడం పక్కా అని చెప్పవచ్చు.