సాధారణంగా విక్స్ ని మనం దేనికి వాడతాం? ఎప్పుడైనా తలనొప్పి,జలుబు,దగ్గు వంటివి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో విక్స్ కొంచెం రాస్తే ఉపశమనం కలుగుతుంది.విక్స్ ని తలనొప్పి,జలుబు,దగ్గు వంటి సమస్యలకే కాకూండా చాలా రకాలుగా ఉపయోగించవచ్చు.
ఆ ఉపయోగాల గురించి తెలిస్తే మీరు అసలు నమ్మలేరు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
కొంచెం విక్స్ తీసుకోని దానికి వెజిలిన్ కలిపి చర్మంపై రాస్తే దోమలు కుట్టవు.
ప్రతి రోజు రెండు నుంచి మూడు సార్లు మొటిమలపై విక్స్ రాస్తే తగ్గిపోతాయి.
వెల్లుల్లి రేకులపై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వద్ద పెట్టుకుని గట్టిగా పీల్చితే సైనస్ తలనొప్పి తగ్గుతుంది.
గాయాలకు విక్స్ రాస్తే తొందరగా తగ్గిపోతాయి.
చర్మం సాగిపోయినట్టుగా మార్క్‌లు ఏర్పడితే ఆయా ప్రదేశాల్లో విక్స్ రాయాలి.2 వారాల పాటు ఇలా చేస్తే స్ట్రెచ్ మార్క్స్ పోతాయి.
కొద్దిగా కాటన్ తీసుకుని దానికి విక్స్ రాసి చెవిలో పెట్టుకుంటే చెవి నొప్పి తగ్గిపోతుంది.
విక్స్ డబ్బాను ఓపెన్ చేసి ఆహార పదార్ధాల దగ్గర పెడితే ఈగలు రావు.
కండరాల నొప్పులు ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో విక్స్ రాసి కొంచెం సేపు మసాజ్ చేస్తే నొప్పులు తగ్గిపోతాయి.
చర్మంలో పొడితనం ఎక్కువైతే విక్స్ రాస్తే పొడిదనం తగ్గి తేమ పెరిగి చర్మం మృదువుగా మారుతుంది.
రాత్రి సమయంలో పడుకొనే ముందు పాదాలకు విక్స్‌ను రాసి సాక్స్‌లు వేసుకోవాలి.ఉదయాన్నే సాక్సులను తీసి వేడి నీటితో కాళ్లను కడగాలి.
దీంతో పాదాల పగుళ్లు తగ్గిపోతాయి.
కాలి వేళ్లకు ఫంగస్ ఇన్‌ఫెక్షన్ వస్తే ఆ ప్రదేశంలో విక్స్ రాయాలి.
ఈ విధంగా తరచూ చేస్తుంటే ఇన్‌ఫెక్షన్ త్వరగా తగ్గిపోతుంది.
చర్మంపై దురదలు వస్తుంటే విక్స్ రాయాలి.
దీంతో ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.