పాలల్లో ఖర్జూరం నానబెట్టి తీసుకుంటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా?

ఖర్జూరం( date palm ).తియ్యటి రుచితో పాటు కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, ప్రోటీన్, విట‌మిన్ ఎ, విట‌మిన్ కె, విట‌మిన్ బి ఇలా ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.

 Wonderful Health Benefits Of Soaked Dates In Milk! Dates, Soaked Dates, Soaked D-TeluguStop.com

అందుకే ఆరోగ్య పరంగా ఖర్జూరం అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.అందులోనూ ఖర్జూరం ను నేరుగా కంటే పాలల్లో నానబెట్టి తీసుకుంటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకుని అందులో మూడు నుంచి నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాన్ని ముక్కలుగా క‌ట్ చేసి చేసి వేయాలి.

ఆపై మూత పెట్టి రాత్రంతా వదిలేయాలి.

మరుసటి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు నానబెట్టుకున్న ఖర్జూరాన్ని పాలతో సహా తీసుకోవాలి.ఈ విధంగా పాలల్లో ఖర్జూరం నానబెట్టి రెగ్యులర్ తీసుకుంటే హిమోగ్లోబిన్ శాతం( Hemoglobin percentage ) రెట్టింపు అవుతుంది.

రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.బాడీ రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది.

నీరసం అలసట వంటివి వేధించ‌కుండా ఉంటాయి.

Telugu Dates, Tips, Latest, Milk, Soaked Dates, Soakeddates-Telugu Health

అలాగే ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తీసుకుంటే ఎముకలు( bones ) దృఢంగా మారుతాయి.వయసు పైబడిన మోకాళ్ల నొప్పులు మ‌ద‌న పెట్ట‌కుండా ఉంటాయి.ఇటీవల రోజుల్లో చాలా మంది దంపతులు సంతాన‌లేమి స‌మ‌స్య‌తో( infertility problem ) బాధపడుతున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కూడా ఖర్జూరం అద్భుతంగా సహాయపడుతుంది.రోజు దంపతులిద్దరూ పాలల్లో నానబెట్టిన ఖర్జూరంను తీసుకుంటే సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.లైంగిక సమస్యలు ఉంటే దూరం అవుతాయి.

Telugu Dates, Tips, Latest, Milk, Soaked Dates, Soakeddates-Telugu Health

ఇక పాలల్లో ఖర్జూరం నానబెట్టి రెగ్యులర్ గా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.శరీరం బరువు అదుపులో ఉంటుంది.మెదడు చురుకుదనం పెరుగుతుంది.

రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది మరియు జుట్టు రాలడం సైతం తగ్గు ముఖం ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube