విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.గురువారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం సూర్యాతండా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎంత మంది పిల్లలు ఉన్నది, పిల్లలకు యూనిఫాం, పుస్తకాల పంపిణీ జరిగింది అడిగి తెలుసుకున్నారు.పిల్లలకు బేసిక్స్ చెప్పాలని, చదువుపై శ్రద్ధ కలిగేలా చూడాలని అన్నారు.
పాఠశాలలో నమోదులు పెంచాలని అన్నారు.అంగన్వాడీ కేంద్రంలో గ్రుడ్లు, సరుకులు పరిశీలించారు.
మంచి సన్న బియ్యం వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.సరుకులు పూర్తిగా అయిపోయే వరకు చూడక, ముందస్తుగా తెచ్చుకోవాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయురాలు, అంగన్వాడీ టీచర్ తదితరులు ఉన్నారు.







