క్యారెట్టేగా అని తీసి పారేయకండి.. రోజు ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు!

క్యారెట్( Carrot ) .దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

 Wonderful Benefits Of Carrot For Health! Carrot, Carrot Benefits, Latest News, H-TeluguStop.com

అద్భుతమైన దుంపల్లో క్యారెట్ ఒకటి.క్యారెట్ కళ్ళకు మేలు చేస్తుంది అంతేగా అని చాలా మంది తీసి పారేస్తుంటారు.

కానీ క్యారెట్ కళ్ళకు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అలాగే చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా రోజు క్యారెట్ ను తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.

అందుకోసం ముందుగా ఒక పెద్ద క్యారెట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడగాలి.

ఆపై క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అర అంగుళం పొట్టి తొలగించిన పచ్చి పసుపు కొమ్ము, అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్క( ginger ), ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Carrot, Carrot Benefits, Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసి తాగేయడమే.రోజు ఈ విధంగా క్యారెట్ జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.కంటి చూపు పెరుగుతుంది.క్యాన్సర్( Cancer ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.కొలెస్ట్రాల్ కరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఎముకలు దృఢపడతాయి.

Telugu Carrot, Carrot Benefits, Tips, Latest-Telugu Health

ఆడవారిలో నెలసరి సమస్యలు దూరం అవుతాయి.దంపతుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.ఏవైనా పుండ్లు ఉంటే త్వరగా నయం అవుతాయి.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.మరియు చర్మం యవ్వనంగా కాంతివంతంగా సైతం మెరుస్తుంది.

కాబట్టి క్యారెట్ ను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.తప్పకుండా పైన చెప్పిన విధంగా క్యారెట్ తో జ్యూస్ ను తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.

ఆరోగ్యంగా జీవించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube