ప్రతి ఒక్కరు కూడా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎంతగానో కష్టపడి పని చేస్తూ ఉంటారు.ఎంత కష్టపడినా కూడా మీరు అనుకున్నవి జరగడం లేదా ఏదో ఒక అడ్డంకి వచ్చి మీ పనులు ఆగిపోతున్నాయా అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే.
ఏడు శనివారాలు( Seven Saturdays ) మీరు ఈ విధంగా చేశారంటే కష్టాలన్నీ కూడా దూరమైపోయి ఆనందంగా ఉండవచ్చు.మరి ఇక ఏడు శనివారాలు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరు కూడా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తారు.

శనివారం వెంకటేశ్వర స్వామి వారికి( Venkateswara Swamy ) ప్రత్యేక పూజలు చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది.బాధలు అన్నిటి నుంచి కూడా దూరంగా ఉండవచ్చు.శనివారం రోజు ఏడుకొండలవాడిని పూజించడం వల్ల శని బాధలు దోషాలు వంటివన్నీ కూడా దూరమైపోతాయి.
వెంకటేశ్వర స్వామికి శనివారం ఎంతో ఇష్టం.ఏడు శనివారాలు మీరు ఇలా చేస్తే బాధలు అన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజు తలస్నానం చేసి మీ ఇంట్లో దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి.

ఆ తర్వాత స్వామివారిని అందంగా అలంకరించాలి.బియ్యం పిండితో ప్రమిద చేయాలి.దీని కోసం కొంచెం పాలు, బెల్లం ముక్క, అరటిపండు వేసి బియ్యం పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
ఆ తర్వాత దీనితో మీరు ప్రమిద చేసి ఏడు వత్తులు అందులో వేసి వెంకటేశ్వర స్వామి వారికి వెలిగించాలి.అలానే శనివారం సూర్యోదయం ముందు నిద్రలేచి తులసి కోట( Tulsi ) ముందు దీపాన్ని కూడా కచ్చితంగా పెట్టాలి.
వెంకటేశ్వర స్వామి వారికి మీరు ఇలా చేసిన ఏడు శనివారాలు చేసినప్పుడు దీపారాధన కోసం నువ్వుల నూనె కానీ, నెయ్యిని కానీ ఉపయోగించాలి.ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీటి నుంచి త్వరగా బయటపడవచ్చు.
అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వస్తాయి.