ఇంట్లో ఉన్న తులసి మొక్క ఆరోగ్యమే మన అదృష్టం

   తులసి మొక్క ఒక్కోసారి నీళ్లుపోయికపోయినా ఏపుగా పెరుగుతుంది…మరోసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండిపోతుంది.ఇంకోసారి రంగులు మారుతుంటుంది.

 Importance Of Tulasi Plant, Basil , Plant , Good Health , Health Benifits , Devo-TeluguStop.com

ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరుగుతోందేంటనే భావన చాలామందికి కలుగుతుంది.అయితే భయపడాల్సి ఏమీ లేదుకానీ…మనింట్లో ఏం జరగబోతుందో తులసి మొక్క చెబుతుందని అంటారు పండితులు.

తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే.ఆ ఇంట్లో ఆనందం, సంతోషం ఉంటాయి.ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం.ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతున్నా.

ఆ మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మరికొన్ని వచ్చినా….ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు.

ఆకుపచ్చని తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోయి చనిపోతే… అది పితృదోషానికి సంకేతమని చెబుతారు.అంటే ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతోందని అర్థం.

అంటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిక.ఆకులు ఉన్నట్టుండి రంగుమారితే… ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం.

ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయని చెబుతారు.

Telugu Devotional, Benifits, Tulasi-Telugu Bhakthi

అంటే తులసి మొక్కకు భక్తితో పూజ చేయడమే కాదు… ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.మొక్కలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.అంతేకాకుండా వాడిన పూలు లేదా మురికి నీటితో తులసిని పూజించకూడదు.

ముఖ్యంగా తలసిదళాలను గంగాజలంతో శుభ్రపరచాలి.అంతేకాకుండా తులసి అద్భుతమైన ఔషధం.

ఇది రక్తపోటు, జీర్ణవ్యవస్థ నియంత్రించడంలో తులసి ఎంతో మేలు చేకూరుస్తుంది.మానసిక వ్యాధులు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

మలేరియా, ఇతర రకాల జ్వరాల్లో తులసి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.అంతేకాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది.

రాత్రిపూట తులసి విత్తనాన్ని ఒక గ్రాము పొడి నీటిలో నానబెట్టడం మరియు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వీర్య రక్షణలో చాలా సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube