అతడిని వారు దళితుడని చిన్న చూపు చూసారు.దళితుడిగా పుట్టడం అతడి తప్పు కాదు.
కానీ వారు అలా చూడడం మాత్రం ఖచ్చితంగా తప్పే.రోజురోజుకూ టెక్నాలిజీ పెరుగుతున్న ఈ కాలంలో కూడా కులాలు, మతాలు అంటూ పట్టుకుని వేలాడే వారు చాలా మంది ఉన్నారు.
ఇప్పటికీ కులాల పేరుతో చాలా మందిని మానసికంగా హింసిస్తున్నారు.
సమాజంలో వారిని చిన్న చూపు చూస్తూ నలుగురిలో వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు.
ఇప్పటికే చాలా మందిలో మార్పు వచ్చినప్పటికీ ఇంకా కొంత మంది మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.వారు కూడా మనుషులు అనే విషయాన్నీ మర్చి పోయి ప్రవర్తిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.దళితుడు అని అతడిని మానసికంగా హింసించారు.
ఈ అమానుషమైన ఘటన బెంగుళూరులో జరిగింది.బెంగుళూరు లోని ఒక ఆసుపత్రిలో పని చేస్తున్న ముగ్గురు సిబ్బంది ఒక వ్యక్తిని దళితుడు అని చిన్న చూపు చూసారు.
అతడిని మురికి కాలువలను తొలగించడానికి మ్యాన్ హోల్ ను శుభ్రం చేయమని అందులోనే పని చేసే దళిత ఉద్యోగిని బలవంతం చేసారు.ఈ ఘటనపై కేసు నమోదు అయినట్టు పోలీసులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ప్రివెన్షన్ యాక్ట్ -1989 లోని సెక్షన్ 3(1), ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ రీహాబిలిటేషన్ సెక్షన్ 7,8,9 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.ఆసుపత్రిలో 21 ఏళ్లుగా పని చేస్తున్న దైవాదీనం (53) అనే వ్యక్తిని ఆసుపత్రి లోని ముగ్గురు సిబ్బంది మ్యాన్ హోల్ క్లీన్ చెయ్యమని ఒత్తిడి చేసారు.చేయక పోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని బెదిరించడంతో అతడు మ్యాన్ హోల్ క్లీన్ చేసాడు.అయితే ఆ తర్వాత ఆ తర్వాత అతడు సాంఘిక సంక్షేమ శాఖ ను సంప్రదించగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు.