రొటీన్ సినిమాలు అక్కర్లేదు.. కొత్తగా కావాలంటున్న ప్రేక్షకులు..టెన్షన్ లో హీరోలు

ఈ రోజుల్లో సినిమా అయినా షార్ట్ ఫిలిం అయినా, వెబ్ సిరీస్ అయినా ప్రేక్షక దేవుళ్ళకి నచ్చితే చాలు అది అందాలన్ని ఎక్కుతుంది, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన స్టార్ హీరో సినిమా అయినా కూడా పాతాళానికి పడిపోతుంది.ఇందులో ఎటువంటి అనుమానం లేదు.

 Routine Movies Are Turning Into Disasters , Chirenjeevi, Surya, Ram Charan, Ajit-TeluguStop.com

ప్రతి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆయా సినిమాలకు చెందిన హీరో లేదా దర్శకుడు, లేదంటే ప్రొడ్యూసర్ సినిమా విజయవంతం అవుతుందా లేదా, ఆ చిత్రం ప్రేక్షకుడిని మెప్పిస్తుందా లేదా, ప్రేక్షకుడి టేస్ట్ కి తగ్గట్టుగా చిత్రం ప్రెసెంట్ చేశామా లేదా అనే టెన్షన్ పడటం సర్వసాధారణం.అందుకే మెగాస్టార్ లాంటి హీరోకు కూడా ఇప్పుడు ఈ ఆడియెన్స్ ఫీవర్ పట్టుకుంది.

ఒక్క మెగాస్టార్ ఏంటి ఇండస్ట్రీ లో అందరి హీరోల పరిస్థితి దాదాపు ఇంతే.

ఇక చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం అయన ఐదు సినిమాలతో బిజీ గా ఉన్నారు.

ఇప్పటికే ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇది కాకుండా మోహన్ రాజా తో గాడ్ ఫాదర్ వంటి మూవీ కూడా చేస్తున్నాడు.

అలాగే ఫ్లాప్ చిత్రాల దర్శకుడు అయినా మెహర్ రమేష్ తో కూడా బోలా శంకర్ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.అయితే బాబీ తో సైతం ఒక మూవీ కి పని చేసేందుకు ఒప్పుకున్నారు.

ఈ చిత్రం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.మరో వైపు వెంకీ కుడుములు తో సైత ఒక చిత్రానికి పచ్చ జెండా ఉప్పుడు మెగాస్టార్.

ఇక వీటిలో అసలు అభిమానులకు కావాల్సిన సినిమా ఏది ఈ సినిమా లో ఎలాంటి ఎలిమిమెంట్స్ ఉండబోతున్నాయి, ఒక వేళా అన్ని మసాలాలు దట్టంగానే పట్టిన ఇంకా ఏమైనా మిస్ అయ్యామా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చిరంజీవి ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ఉండకూడని గట్టిగానే దర్శకులకు చెపుతున్నారట.

రామ్ చరణ్ దర్శకుడు శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా విషయంలోనూ సినిమా యూనిట్ ఇలాంటి టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తుంది.ఒక సినిమాలో ఉన్న ఏదైనా ఎలిమెంట్ తమ సినిమాలో లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఎందుకంటే సోషల్ మీడియా, టెక్నాలజీ పెరిగిన తర్వాత అసలు చిన్న విషయం దొరికిన చాలు కాపీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.అందుకే శంకర్ రామ్ చరణ్ ని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్ లో చూపించబోతున్నారట.

Telugu Ajith, Chirenjeevi, Rajinikanth, Ram Charan, Shanker, Surya, Tollywood-Te

ఇక ఇదే దోవలో మరి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.మణిరత్నం పొన్నియున్ సెల్వన్, సూర్య, అజిత్, కమల్ హాసన్ చిత్రాలు కూడా ఎంతో గ్రాండ్ గా తెర మీదకు వచ్చెనందుకు సిద్ధం అవుతున్నాయి.ఈ చిత్రాల విడుదలకు ముందే సినిమాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ దర్శకులు తమ మార్కు ఉండేలా చూస్తున్నారట .ఇక సీనియర్ హీరో అయినా రజిని కూడా ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తన సినిమాను ప్రెసెంట్ చేయాలనీ, అవసరం అయితే స్టోరీ లో కూడా మార్పులు చేయాలంటూ సూచిస్తున్నారట.పెద్ద హీరో, పెద్ద బడ్జెట్ అయితే సరిపోతూ అని ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని ఈ స్టార్స్ అంత కూడా తాపత్రయ పడుతుండటం చూస్తే అందరికి రాజమౌళి ఫీవర్ పట్టిందా ఏంటి అనే అనుమానం రాకమానదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube