ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడితే 60 లోనూ జుట్టు నల్లగా మెరిసిపోతుంది!

తెల్ల జుట్టు.‌.స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.పైగా ఇటీవల రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

 If You Use This Magical Oil, Your Hair Will Shine Black Even At 60! Magical Oil,-TeluguStop.com

తక్కువ వయసులోనే జుట్టు తెల్లబడితే ముస‌లి వారిలా కనిపించడమే కాదు మనోధైర్యాన్ని సైతం కోల్పోతుంటారు.ఇరుగు పొరుగువారు ఎక్కడ ఎగతాళి చేస్తారో అని లోలోన తీవ్రంగా మదన పడుతుంటారు.

ఈ జాబితాలో మీరు ఉండకూడదు అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్‌ ఆయిల్ ను వాడాల్సిందే.

ఈ ఆయిల్ ను వాడితే అర‌వై లోనూ మీ జుట్టు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.

ఇంత‌కీ ఆ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి.

అరకప్పు మెంతాకు వేసుకోవాలి.చివరిగా నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్‌ కొబ్బరి నూనె వేసుకోవాలి.

Telugu Black, Control White, Care, Care Tips, Long, Magical Oil, Thick, White-Te

నూనె హీట్ అవ్వడానికి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మెంతాకు మిశ్రమాన్ని వేసుకోవాలి.చిన్న మంటపై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆయిల్ ను హీట్ చేయాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ఈ మ్యాజికల్ ఆయిల్ ను వారంలో రెండు సార్లు వినియోగించాలి.

Telugu Black, Control White, Care, Care Tips, Long, Magical Oil, Thick, White-Te

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల‌ నుంచి చివ‌ర్ల‌ వరకు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.ఈ మ్యాజికల్ ఆయిల్ ను వాడటం వల్ల జుట్టు తెల్ల పడకుండా ఉంటుంది.నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఉన్నా సరే అవి క్రమంగా నల్లగా మారతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube