ప్రస్తుత రోజులలో చాలా చిన్న వయసు పిల్లలు కూడా చెడు అలవాట్లకు( Bad Habits ) దగ్గరవుతున్నారు.ప్రస్తుత సమయంలోనే పిల్లలు త్వరగా చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు.
చెడు వ్యసనాలు ఎలా ఉంటాయో ఒకసారి ట్రై చేద్దాం అని కూడా బానిస అవుతున్నారు.కానీ ఏదైనా ఒక స్టేజ్ వరకు పరిమితం అవ్వాలి.
కొన్ని ఏళ్లు తాగిన సరే ఆ తర్వాత స్మోకింగ్ ( Smoking ) మానేయాలి.ముఖ్యంగా నలభై సంవత్సరాల లోపు వారు మానేస్తే వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో పరిశోధకులు అధ్యయనం చేశారు.
ధూమపానం మానేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ధూమపానం మానేయడం అనేది మరణ ప్రమాదాన్ని( Death ) తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.ప్రజలు వారి జీవితంలో చాలా త్వరగా దాని ప్రయోజనాలను పొందుతారు.ముఖ్యంగా చెప్పాలంటే ధూమపానం చేయని వారితో పోలిస్తే 40 మరియు 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ధూమపానం చేసేవారు చనిపోయే ప్రమాదం మూడు రెట్లు ఉన్నట్లు కనుగొనబడింది.
ఫలితంగా సగటున 12 నుంచి 13 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయినప్పటికీ ధూమపానం చేయని వారి కంటే మాజీ ధూమపానం చేసేవారిలో మరణాల ప్రమాదం 1.3 రెట్లు గణనీయంగా తగ్గింది.ఇది ఆయుర్దాయంలో గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది.
మూడు సంవత్సరాల లోపు ధూమపానం మానేసిన వారి ఆయురారోగ్యం, అరెళ్ళ వరకు పెరుగుతుంది.అలాగే ఊపిరితిత్తుల( Lungs ) దెబ్బ తినడం వల్ల శ్వాసకోశ వ్యాధికి కాస్త తక్కువ ప్రభావంతో, వాస్కులర్ వ్యాధి మరియు క్యాన్సర్( Cancer ) నుండి మరణ ప్రమాదాన్ని తగ్గించడం యొక్క సానుకూల ప్రభావాన్ని అధ్యయనం తెలిపింది.
కాబట్టి ఇప్పటివరకు తాగిన సరే ఇకనుంచి ఒకే రోజులో సాధ్యం కాకపోతే కొద్దికొద్దిగా ఈ అలవాటును దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీరు ఆరోగ్యవంతంగా జీవించవచ్చు.