పాలు మ‌ర‌గ‌బెట్ట‌కుండా ఉంచితే ఎందుకు విరిగిపోతాయో తెలుసా?

పాలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.పాలే కాకుండా దీనితో రూపొందే పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ, లస్సీ, చీజ్, పనీర్, ఐస్ క్రీం, క్రీమ్ మొదలైన వాటిని కూడా తీసుకుంటాం.

 Do You Know Why Milk Breaks Down If Left Untreated , Boiling Milk, Curdle, Heat-TeluguStop.com

అయితే పాలను మరిగించడం ఆలస్యం అయితే విరిగిపోతాయి.ఇలా ఎందుకు జరుగుతుంది? పాలను ఎక్కువ కాలం వాడాలంటే ప్రతి 4-5 గంటల వ్యవధిలో మ‌రిగించాలి లేదా ఫ్రిజ్‌లో ఉంచాలి.అధిక ఉష్ణోగ్రత లేదా తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచిన పాలు త్వరగా విరిగిపోవు.పాలు ఎందుకు విరిగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం.పాలు విరిగిపోవ‌డం దాని స్వచ్ఛతకు గుర్తు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

కల్తీ పాలు ఉష్ణోగ్రతల తేడాలో త్వరగా విరిగిపోవు.

పాలలో ఉండే ప్రోటీన్ యొక్క చిన్న కణాలు పాలలో స్వేచ్ఛగా తేలుతూ ఒకదానికొకటి దూరాన్ని మెయింటెయిన్ చేస్తాయి.ఈ దూరం పాలు విరిగిపోకుండా చూస్తుంది.

గది ఉష్ణోగ్రతకు ఎక్కువసేపు గురికావడం వల్ల పాలలో పీహెచ్ స్థాయి తగ్గడంతో, ప్రోటీన్ కణాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభిస్తాయి.పిహెచ్ స్థాయి పడిపోవడం ప్రారంభించినప్పుడు, అది ఆమ్లంగా మారడం ప్రారంభమవుతుంది.

ఇటువంటి స్థితిలోనే పాలు విరిగిపోతాయి.వేసవి కాలంలో పాలు విరిగిపోయే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకే వేసవిలో మనం రోజుకు 3-4 సార్లు పాలు కాచుకుంటాం.

అంతే కాకుండా పాలను ఎక్కువ సేపు ఫ్రిజ్‌లో ఉంచుతాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube