శ్రీవారి భక్తులకు శుభవార్త.. త్వరలోనే సర్వదర్శనాలు

శ్రీవారి భక్తులకు శుభవార్త.త్వరలోనే సర్వదర్శనాలు.

 Good News For Srivari Devotees. Soon All Visions,latest News-TeluguStop.com

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.బుధవారం ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను జారీ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

రోజుకు రెండు వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు తెలిపింది.తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్లో టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది.

ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.కరోనా రెండో దశ ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపి వేసింది.కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300), ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు, సిఫారసు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటివరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు.ఈ విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తడంతో కరోనా నిబంధనలు అనుసరిస్తూ చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది.గతంలో నిత్యం 8వేల సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేసేది.

సుమారు ఏడాదిన్నరకాలంగా శ్రీవారి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న సామాన్య భక్తులకు తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొంత ఊరట నిచ్చినట్లు కన్పిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube