నటి అనుష్క శెట్టి ( Anushka Shetty ) అంటే సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.ఈమె సౌత్ లో మంచి పేరు తెచ్చుకొని అప్పట్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.
అయితే ఆ మధ్యకాలంలో కాస్త ఇండస్ట్రీకి దూరంగా ఉండి ఈ మధ్యనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (Miss Shetty Mr Polishetty) అనే సినిమాతో మన ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది.అయితే తాజాగా అనుష్క 42వ బర్త్డేని జరుపుకుంటుంది.
అయితే అనుష్క బర్త్ డే ( Anushka Birthday ) సందర్భంగా ఆమె గురించి ఎవరికీ తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.జార్జియా కార్ డ్రైవర్ కి హీరోయిన్ అనుష్క కి మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
మరి ఇంతకీ అనుష్క శెట్టికి జార్జియా కార్ డ్రైవర్ కి( Georgia Car Driver ) మధ్య ఉన్న సంబంధం ఏంటంటే అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం జార్జియా (Georgia) వెళ్ళిందట.ఇక అక్కడికి వెళ్లాక ఆమెకు జాజా అనే ఒక కార్ డ్రైవర్ ని పెట్టి అలాగే ఆమె కేర్ టేకర్ గా కూడా ఉంచారట.
ఇక అలా సినిమా షూటింగ్ సాగుతున్న తరుణంలో ఓరోజు కార్ డ్రైవర్ జాజా( Car Driver Zaza ) రాకుండా ఉండేసరికి అతను ఎందుకు రాలేదు అని మేనేజర్ ని అడిగిందట.దానికి మేనేజర్ సమాధానం ఇస్తూ.
జాజా తన కారు లోను కటకపోయేసరికి కంపెనీ వాళ్లు ఆయన కారుని లాక్కెళ్ళిపోయారట.

అందుకే ఆయన ఈరోజు మీ దగ్గరికి రాలేదు అని సమాధానం ఇచ్చారట.ఇక ఈ విషయం తెలుసుకొని వెంటనే అనుష్క కార్ డ్రైవర్ జాజా ఇంటికి వెళ్లి మరీ ఆయనను కార్ షోరూం కి తీసుకెళ్లి ఒక కాస్ట్లీ బెంజ్ కార్( Benz Car ) కొనిచ్చిందట.ఇక ఈ కారు కొనియడంతోనే జాజా ఫ్యామిలీ మొత్తం చేతులెత్తి మొక్కిందట.
అంతేకాదు అప్పటినుండి జాజా ఫ్యామిలీ అనుష్క (Anushka) ను ఒక దేవతల కొలిచే వారట.ఇక ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు.

కానీ ఆ మధ్యకాలంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్(Shyam Prasad) పని మీద జార్జియా వెళ్ళినప్పుడు అతని దగ్గర జాజా కార్ డ్రైవర్ గా చేశారు.ఇక శ్యామ్ ప్రసాద్ తెలుగువారు అని తెలుసుకొని ఆయనకు అనుష్క చేసిన సహాయం మొత్తాన్ని బయటపెట్టారట.ఇక అలా తన స్నేహితురాలు అనుష్క ఇంత పెద్ద సహాయం చేసిందా అని శ్యాంప్రసాద్ జార్జియా నుండి తిరిగి వచ్చాక ఈ విషయాన్ని ఇండస్ట్రీ వాళ్ళతో అలాగే అనుష్క అభిమానులతో కూడా పంచుకున్నారు.అలా అనుష్క గొప్పతనం అందరికీ తెలిసి వచ్చింది.







