మన దేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ పురాతన దేవాలయాలన్నీటికి ఒక్కొక్క దేవాలయానికి ఒక్క ఆచారాలు,సంప్రదాయాలు ఉంటాయి.
అంతే కాకుండా ఆలయం అంటే పూజలు చేయడం, కొబ్బరికాయలు కొట్టడం, ప్రదక్షిణలు చేయడం ఇలాంటి కార్యాలు అన్ని ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.దేవాలయాలకు భక్తులు వచ్చి ప్రతి రోజు ఇలాంటి పుణ్య కార్యాలు చేస్తూనే ఉంటారు.
కానీ భక్తులు దేవాలయానికి వెళ్లి దొంగతనం చేయాలని ఎవరైనా అనుకుంటారా.ఎవరు అస్సలు అనుకోరు.కానీ ఈ దేవాలయానికి వెళ్లి దొంగతనం కచ్చితంగా చేయాలి.ఇలా దొంగతనం చేయడం ఈ గుడి సాంప్రదాయం.
ఇది నమ్మడానికి వింతగా ఉన్న ఇదే నిజం.ఇక్కడ దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారట.
ముఖ్యంగా చెప్పాలంటే భక్తులు కోరుకున్న కోరికలు కూడా ఇలా దొంగతనం చేయడం వల్లనే నెరవేరుతాయట.ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరఖండ్ లోని చూడియాల గ్రామంలోని చూడామణి అమ్మ వారి దేవాలయం ఉంది.ఈ దేవాలయాన్ని దర్శిస్తే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.ఈ దేవాలయాన్ని దర్శించిన వారిలో చాలా మందికి మగ పిల్లలు కూడా పుట్టారని ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.పిల్లలు కలగాలనుకునేవారు అమ్మవారి పాదాల దగ్గర ఉండే చెక్క బొమ్మను దొంగతనం చేయాలి.