ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.48
సూర్యాస్తమయం: సాయంత్రం.6.14
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34
మేషం:

ఈరోజు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.అవసరానికి ధన సహాయం లభిస్తుంది.నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.
వృషభం:

ఈరోజు ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.
మిథునం:

ఈరోజు దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు.పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.
కర్కాటకం:

ఈరోజు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.నూతన వాహన యోగం ఉన్నది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అధికారులతో చర్చలు ఫలిస్తాయి.వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
సింహం:

ఈరోజు అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య:

ఈరోజు మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి.ఆరోగ్యం మందగిస్తుంది.ధన పరమైన చికాకులు పెరుగుతాయి.
గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
తుల:

ఈరోజు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి.
గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
వృశ్చికం:

ఈరోజు దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు.ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.నూతన వస్తులాభాలు ఉంటాయి.ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.
ధనుస్సు:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు.
ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.
మకరం:

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దైవచింతన పెరుగుతుంది.ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుంభం:

ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది.వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి.
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.
మీనం:

ఈరోజు దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.చిన్ననాటి మిత్రులను ఆగమనం ఆనందం కలిగిస్తుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు.వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా సాగుతాయి.