ఫేషియల్ హెయిర్ తో సతమతం అవుతున్నారా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఫేషియల్ హెయిర్.ఎంతో మంది ఈ సమస్యతో సతమతం అవుతుంటారు.

 Home Remedy, Skin Care, Skin Care Tips, Beauty, Beauty Tips, Facial Hair, Facial-TeluguStop.com

ముఖ్యంగా మగువలు ఫేషియల్ హెయిర్ కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.ఫేషియల్ హెయిర్ కారణంగా ముఖ సౌందర్యం దెబ్బతింటుంది.

ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.అందుకే ఫేషియల్ హెయిర్ ను ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉంటారు.

అయితే రేజర్ ను ఉపయోగించడం వల్ల మళ్ళీ కొద్ది రోజులకే ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంటుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే ఫేషియల్ హెయిర్ సహజంగానే రిమూవ్ అవ్వడంతో పాటు మళ్ళీ త్వరగా హెయిర్ రాకుండా సైతం ఉంటుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు పాలు వేసుకోవాలి.

పాలు హీట్ అవ్వగానే అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు పటిక బెల్లం పొడి వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Tips, Facial, Facial Remedy, Remedy, Skin Care, Skin Care Tips-Telugu Hea

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకోవాలి.అలాగే రెడీ చేసి పెట్టుకున్న పాలు అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై హెయిర్ కు ఆపోజిట్ డైరెక్షన్ లో రబ్ చేస్తూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.

అనంత‌రం వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేస్తే ఫేషియల్ హెయిర్ దెబ్బకు తొలగిపోతుంది.

అలాగే మళ్లీ త్వరగా హెయిర్ రాకుండా సైతం ఉంటుంది.పైగా ఈ రెమెడీ వల్ల చర్మం పై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్, టాన్ తొలగిపోతుంది.

చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube