దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌ల‌ను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!

తెల్ల‌టి మెరిసేటి దంతాల‌ను మ‌న‌ల్ని మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా మారుస్తాయి.కానీ కొంద‌రు దంతాలు తెల్ల‌గా కాకుండా ప‌సుపు రంగులో క‌నిపిస్తుంటాయి.

 Here Are The Best Home Remedies To Get Rid Of Yellow Stains On Teeth Details, H-TeluguStop.com

దంతాలు ప‌సుపు రంగులో( Yellow Teeth ) మార‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.ముఖ్యంగా కాఫీ, టీల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, గుట్కా న‌మ‌ల‌డం, దంతాల శుభ్రతలో లోపాలు, జన్యుపరమైన వ్యాధులు, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌లు ఏర్ప‌డుతుంటాయి.

అయితే ఈ మ‌ర‌క‌ల‌ను పోగొట్టి దంతాల‌ను తెల్ల‌గా మార్చ‌డానికి తోడ్ప‌డే బెస్ట్ హోమ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నారింజ తొక్క‌లు( Orange Peel ) దంతాల‌ను తెల్ల‌గా మెరిపించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.నారింజ తొక్క‌ల‌ను దంతాలపై రెండు నుంచి మూడు నిమిషాల పాటు రుద్ది, ఆపై వాట‌ర్ తో శుభ్రంగా కడగండి.

ఇలా రెగ్యుల‌ర్ గా చేస్తే ప‌సుపు మ‌ర‌క‌లు పోయి దంతాలు వైట్‌గా, షైనీగా మార‌తాయి.

Telugu Applecider, Tips, Latest, Neem Stick, Orange Peel, Teeth, Teeth Tips, Yel

ఒక గ్లాసు నీటిలో వ‌న్‌ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి మిక్స్ చేయండి.ఇప్పుడు ఈ వాట‌ర్ ను నోట్లో పోసుకుని రెండు నిమిషాల పాటు పుక్కిలించండి.వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌సుపు దంతాలు తెల్ల‌గా, ఆరోగ్యంగా మార‌తాయి.

వేప పుల్ల( Neem Stick ) సహజ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.పూర్వం వేప పుల్ల‌తోనే దంతాల‌ను తోముకునేవారు.వేప పుల్ల‌తో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల నోట్లో బ్యాక్టీరియా నాశ‌నం అవుతుంది.దంతాలపై ప‌సుపు మ‌ర‌క‌లు కూడా వ‌దిలిపోతాయి.

Telugu Applecider, Tips, Latest, Neem Stick, Orange Peel, Teeth, Teeth Tips, Yel

రెండు స్ట్రాబెర్రీలను పేస్ట్ గా చేసి అందులో వ‌న్ టీ స్పూన్ బేకింగ్ సోడా కలపండి.ఈ మిశ్ర‌మాన్ని దంతాలకు అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత కడగండి.ఈ రెమెడీని పాటించినా కూడా దంతాలు తెల్ల‌గా మార‌తాయి.కాంతివంతంగా మెరుస్తాయి.

ఇక హోమ్ రెమెడీస్‌ని పాటించ‌డంతో పాటుగా రోజూ రెండు సార్లు బ్రష్ చేయడం, ఫ్లోస్ ఉపయోగించడం త‌ప్ప‌నిస‌రిగా అల‌వాటు చేసుకోండి.టీపు, కాఫీ, పొగాకు వంటి పదార్థాల వినియోగాన్ని తగ్గించండి.

దంతాలకు అనుకూలమైన టూత్ పేస్ట్ ను వాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube