భర్తతో కిడ్నీ అమ్మించిన భార్య.. వచ్చిన రూ.10 లక్షలు తీసుకుని ప్రియుడితో జంప్..!

పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని సంక్రైల్ పట్టణంలో( Sankrail town ) ఓ షాకింగ్ ఘటన జరిగింది.ఓ భర్తను కట్టుకున్న భార్యే దారుణంగా మోసం చేసింది.

 The Wife Who Sold Her Kidney With Her Husband Took Rs. 10 Lakh And Jumped With H-TeluguStop.com

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మించి, అతడి కిడ్నీ అమ్మేలా చేసింది.ఆ డబ్బు చేతికి రాగానే ప్రియుడితో ఉడాయించింది.

భర్తను నిలువునా ముంచేసింది, రోడ్డున పడేసింది.ఆ దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు.కూతురు చదువు, పెళ్లి కోసం డబ్బులు కావాలి.దీంతో భార్య తన భర్తకు కిడ్నీ అమ్మితే డబ్బులొస్తాయని చెప్పింది.భార్య మాటలు నమ్మిన భర్త అందుకు ఒప్పుకున్నాడు.ఏడాది పాటు కొనుగోలుదారుడి కోసం వెతికారు.

మూడు నెలల క్రితం ఓ వ్యక్తి దొరికాడు.కిడ్నీ అమ్మకానికి రూ.10 లక్షలు డీల్ కుదిరింది.

భర్త ఆపరేషన్ బాధలో కోలుకుంటుండగా, భార్య మాత్రం సీక్రెట్ ఎఫైర్ నడిపింది.

బారక్‌పూర్ కు చెందిన రవి దాస్ ( Ravi Das )అనే పెయింటర్‌తో ఆమె ప్రేమాయణం సాగించింది.ఫేస్‌బుక్‌లో మొదలైన పరిచయం కాస్తా సీరియస్ రిలేషన్‌షిప్‌కు దారితీసింది.

కిడ్నీ అమ్మిన తర్వాత అసలు కథ మొదలైంది.రూ.10 లక్షలు తీసుకుని ప్రియుడితో కలిసి పరారైంది.

Telugu Betrayal, Sells Kidney, Organ Trade, India Organ, Kidneysale, Organ Scam,

మోసపోయానని గ్రహించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కుటుంబ సభ్యులు, 10 ఏళ్ల కూతురు సాయంతో ఆమె ఆచూకీ కనిపెట్టాడు.ఆమెను నిలదీయగా మొహం చాటేసింది.తలుపులు మూసుకుని లోపలి నుంచి వెక్కిరిస్తూ “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.విడాకుల నోటీసులు పంపిస్తా” అని హేళన చేసింది.దాంతో, సదరు భర్త గుండె పగిలిపోయింది, ఆమె చేసిన మోసాన్ని, కుట్రను అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు.

Telugu Betrayal, Sells Kidney, Organ Trade, India Organ, Kidneysale, Organ Scam,

దేశంలో అక్రమ అవయవ వ్యాపారం ఎంత దారుణంగా ఉందో ఈ ఘటన తెలియజేస్తోంది.పేద ప్రజలను బ్రోకర్లు, ఆస్పత్రులు దోచుకుంటున్నారు.2024, జనవరిలో రంగారెడ్డి జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టయింది.ఇద్దరు దాతలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చెల్లించి గ్రహీతల నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారు.ప్రస్తుతం ఈ భర్త పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

డబ్బు లేదు, భార్య లేదు.మిగిలింది మోసం, బాధ మాత్రమే.

కుటుంబం కోసం చేసిన త్యాగానికి దక్కిన ప్రతిఫలం ఇది.ఇది ఒక్క వ్యక్తి కథ కాదు.అక్రమ అవయవ వ్యాపారంలో బలవుతున్న ఎంతో మంది పేదల ఆవేదన ఇది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube