1.తెలంగాణలో గేట్ పరీక్ష కేంద్రాల పెంపు
తెలంగాణ రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
2.సేలం లో కరుణానిధి విగ్రహం
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కి సేలం అన్న పార్క్ ప్రాంగణంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు సేలం కార్పొరేషన్ తీర్మానించింది.
3.ఏపీలో ఆరుగురు ఐఏఎస్ ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
4.సింగపూర్ వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ కు వెళ్లారు.
5.శబరిమల యాత్రికులకు ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం 38 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
6.విచారణకు హాజరైన అడ్వకేట్ ప్రతాప్
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం పై సిట్ అధికారులు విచారణ చేపట్టారు.ఈరోజు సిట్ విచారణకు అడ్వకేట్ ప్రతాప్ హాజరయ్యారు.
7.పిఎస్ఎల్వి సీ 54 ప్రయోగం విజయవంతం
ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వీ సి 54 ప్రయోగం విజయవంతం అయింది.
8.విజయవాడలో జగన్ పర్యటన
నేడు విజయవాడలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు.భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
9.పుస్తకావిష్కరణ
గుంటూరు బృందావన్ గార్డెన్స్ అన్నమయ్య కళా వేదికలో విమర్శ వీక్షణం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది.
10.రైతు శిక్షణ తరగతులు
గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నే పాడులో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు రైతు శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి.
11.పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు
గుంటూరు జిల్లా పల్నాడు కారంపూడి లో నాలుగో రోజు పల్నాటి వీర ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి.
12.భవన నిర్మాణ కార్మికుల మహాసభలు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నేటి నుంచి మూడు రోజులపాటు భవన నిర్మాణ కార్మికుల జాతీయ మహాసభలు జరగనున్నాయి.
13.జెసి ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం కేసు
అనంతపురం జిల్లా టిడిపి కీలక నేత , అనంతపురం మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
14.ఓటర్ నమోదుకు మరో అవకాశం
కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందిడిసెంబర్ 8 వరకు కొత్త ఓటు నమోదుకు అవకాశం ఇచ్చారు.
15.ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లపై అపోహలు వద్దు
ముస్లిం , మైనార్టీ రిజర్వేషన్లపై ఎవరు అపోహలు పడవద్దు అని తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు.
16.ఐటీ అధికారి రత్నాకర్ కేసు విచారణ పై స్టే
ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ రత్నాకర్ పై బోయినపల్లి పీఎస్ లో నమోదయిన కేసు పై విచారణ ను నిలిపివేస్తూ హై కోర్ట్ ఆదేశాలు జా mరీ చేసింది.
17.బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దు
ఎమ్మెల్యే ల ఎర కేసులో ఈ నెల 26, లేదా 28 న విచారణకు హాజరు కావాలని సిట్ ఇచ్చిన నోటీసుల పై హై కోర్ట్ స్టే విధించింది.
18.పార్టీ మారే ఆలోచన లేదు : పిడమర్తి రవి
తాను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తన ఊపిరి ఉన్నంతవరకు కేసీఆర్ తోనే కలిసి నడుస్తానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు.
19.రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత
రైతు సంఘాలు చేపట్టిన ఛలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది.ఖైరతాబాద్ సర్కిల్ లో రైతు సంఘాల యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,550