మీ పిల్లలు ఎప్పుడూ నీరసంగా కనిపిస్తున్నారా? నిర్లక్ష్యం వద్దు ఇలా చేయండి!

సాధారణంగా కొందరు పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు.కానీ కొందరు పిల్లలు మాత్రం ఎప్పుడూ నీరసంగా, మూడీగా కనిపిస్తుంటారు.

 Include This Smoothie In Your Diet To Keep Kids Active And Energetic! Energetic-TeluguStop.com

సరైన పోషకాలు అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.మీ పిల్లలు కూడా ఎప్పుడు ఇలానే కనిపిస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

వెంటనే ఇప్పుడు చెప్పబోయే స్మూతీని వారి డైట్ లో చేర్చండి.ఈ స్మూతీ పిల్లలకు అవసరం అయ్యే ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలను అందిస్తుంది.

అలాగే వారిని రోజంతా యాక్టివ్ గా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి.అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలను వేసి ఒక గ్లాస్ ఆ వాటర్ పోసి ఇర‌వై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో నానబెట్టుకున్న ఓట్స్ మరియు ఖర్జూరాలను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే మూడు స్పూన్లు వేయించి గింజ తొలగించిన పల్లీలు, వన్ టేబుల్ స్పూన్ వేయించిన‌ అవిసె గింజల పొడి, పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక గ్లాసు పాలు వేసుకోవాలి.

చివ‌రిగా రెండు సపోటా పండ్లను తీసుకుని పైతొక్క, లోపల ఉండే గింజలను తొలగించి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ టేస్టీగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు ఈ స్మూతీని ఇస్తే నీరసం అలసట వంటివి వారి దరిదాపుల్లోకి కూడా రావు.రోజంతా ఫుల్ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.

చదువులతో పాటు ఆటపాటల్లో చురుగ్గా పాల్గొంటారు.అంతేకాదు ఈ స్మూతీ పిల్లల డైట్ లో చేర్చడం వల్ల వారి ఇమ్యూనిటీ సిస్టం బూస్ట్ అవుతుంది.

బ్రెయిన్ డెవలప్మెంట్ ఎంతో మెరుగ్గా సాగుతుంది.మరియు పిల్లల్లో మలబద్ధకం సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube