భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తుంది.
ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో కొందరు నేతలపై ప్రత్యేక దృష్టిసారించింది.ఈ క్రమంలోనే తాజాగా బీఎస్పీ నేతలపై గులాబీ దళం ఫోకస్ పెట్టింది.
దీంతో బీఎస్పీకి నేతలు, క్యాడర్ దూరం అవుతున్నారట.అయితే కేంద్రంలో అధికారం చేపట్టాలంటే యూపీనే కీలకమని చెప్పొచ్చు.
దీంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలువురిని పార్టీలోకి రావాలని ఆహ్వానించారని సమాచారం.







