దోమలు దూరంగా పారిపోవాలంటే ఈ మొక్కలను పెంచుకోండి

సీజన్ మారింది.వానలు ప్రారంభం అయ్యాయి.

 How To Kill Mosquitoes On Indoor Plants Details, Mosquitoes, Indoor Plants, Kill-TeluguStop.com

దోమలు కూడా స్వైర విహారం చేస్తూ ఉంటాయి.దోమ కుట్టిందంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మాములు దోమ అయితే పర్వాలేదు.కానీ దోమలు కుడితే జ్వరాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఆలా దోమలు మన పరిసరాల్లో లేకుండా ఉండాలంటే కొన్ని మొక్కలను పెంచుకోవాలి.ఇప్పుడు ఆ మొక్కల గురించి తెలుసుకుందాం.

రోజ్‌మేరీ

ఈ మొక్కను ఇంట్లో వేసుకుంటే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది.ఈ మొక్క దోమలను తరిమేస్తుంది.అంతేకాకుండా ఈ మొక్క ఆకులను కొత్తిమీర, కరివేపాకులా వంటల్లో వేసుకుంటే వంటలకు చక్కని రుచి వస్తుంది.

అగిరేటమ్

ఈ మొక్క గడ్డి మొక్కలా పెరుగుతుంది.ఈ మొక్కకు తెలుపు లేదా ఊదా రంగు పూలు పూస్తాయి.ఈ మొక్కను తెలుగు వారు పోక బంతి అని పిలుస్తారు.ఈ మొక్కలను పెంచుకుంటే ఇంటిలోకి దోమలు రావు.

లెమన్‌బామ్

లెమన్‌బామ్ మొక్కల నుండి విడుదలయ్యే వాసన దోమల్ని తరిమేస్తుంది.ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది.ఈ మొక్కకు నీరు కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది.ఈ మొక్కలను తోటలో, ప్రహరీ గోడలపై, ఇంట్లో కిటికీల వద్ద కూడా పెంచుకోవచ్చు.

పుదీనా

పుదీనా కూడా దాని ఘాటైన వాసనతో దోమలను తరిమేస్తుంది.పుదీనా మొక్కను కుండీలో పెంచుకోవచ్చు.దోమలు ఉన్న ప్రదేశంలో కొన్ని పుదీనా ఆకులను ఉంచిన దోమలు పారిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube