అందరి చర్మ తత్వాలు ఒకేలా ఉండటం అసాధ్యం.కొందరిది డ్రైగా, మరి కొందరిది ఆయిలీగా, ఇంకొందరికి న్యూట్రల్‌గా ఉంటుంది.
అయితే ఎటొచ్చి ఆయిలీ స్కిన్ వారే అధిక సమస్యలను ఫేస్ చేస్తుంటారు.చర్మంపై అధిక జిడ్డు కారణంగా మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతుంటాయి.
పైగా ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా.మళ్లీ కొద్ది సేపటికే ముఖం జిడ్డుగా, డల్‌గా మారిపోతుంటుంది.
దాంతో మార్కెట్‌లో లభ్యమయ్యే రకరకాల ఉత్పత్తులను చర్మానికి యూస్ చేస్తుంటారు.అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక తెగ సతమతం అవుతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే.అధిక జిడ్డు వదిలిపోవడమే కాదు చర్మం లోతుగా శుభ్రం కూడా అవుతుంది.మరి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి రెండు సార్లు నీటితో కడగాలి.
ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్‌తో సహా మిక్సీ జార్‌లో వేసుకోవాలి.
అలాగే అందులో అర కప్పు టమాటో ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని.దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
![Telugu Tips, Excess Oil, Latest, Lemon, Oily Skin, Skin Care, Skin Care Tips, Re Telugu Tips, Excess Oil, Latest, Lemon, Oily Skin, Skin Care, Skin Care Tips, Re](https://telugustop.com/wp-content/uploads/2022/06/This-is-a-super-remedy-that-removes-excess-oil-and-deep-cleanses-the-skin-detailss.jpg )
అలాగే మరోవైపు పల్చటి వస్త్రంలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని.అందులోని నీటిని తొలగించాలి.ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో నీరు తొలగించిన పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల రైస్ అండ్ టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు చుక్కలు టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.
పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై వేళ్లతో సున్నితంగా రబ్ చేసుకుంటూ గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేస్తే అధిక జిడ్డు పోతుంది.అదే సమయంలో చర్మం లోతుగా శుభ్రపడి కాంతివంతంగా మెరుస్తుంది.