చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి( College ) బైక్‌ల మీదో, సైకిళ్ల మీదో, లేదంటే ఎద్దుల బండ్ల మీదో వెళ్తారు.కానీ మహారాష్ట్రలోని( Maharashtra ) పసరాని అనే ఊరికి చెందిన సమర్థ మహంగడే అనే స్టూడెంట్ మాత్రం మామూలోడు కాదు.
ఏకంగా పారాగ్లైడింగ్( Paraglides ) చేసుకుంటూ పరీక్షా సెంటర్‌కు దూకేశాడు.వామ్మో అనుకునేలా ఆకాశంలో బ్యాగు తగిలించుకుని గాల్లో తేలుతూ కాలేజీకి దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్( Viral Video ) అవుతోంది.
అసలేం జరిగిందంటే.సమర్థ వాయి తాలూకాలో చదువుకుంటున్నాడు.పరీక్ష రోజు( Exam Day ) పంచగనిలో ఏదో పని మీద ఉన్నాడు.సడన్‌గా చూసుకుంటే పరీక్ష టైమ్ దగ్గర పడిపోయింది.
కాలేజీకి వెళ్లడానికి టైమ్ లేదు.మహా అయితే 15-20 నిమిషాల్లో వెళ్లాలి.
అసలు చిక్కంతా అక్కడే వచ్చి పడింది.వాయి-పంచగని రోడ్డులో పసరాని ఘాట్ సెక్షన్‌లో ట్రాఫిక్ జామ్( Traffic Jam ) మామూలుగా ఉండదు.
రోడ్డు మీద వెళ్తే టైమ్‌కి కాలేజీకి అస్సలు చేరలేడు.ఇక ఏం చేయాలో పాలుపోలేదు సమర్థకు.
అప్పుడే పంచగనిలోని జీపీ అడ్వెంచర్స్ వాళ్ల గోవింద్ యెవాలే అనే అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ ఎంట్రీ ఇచ్చాడు.పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే ఒక సూపర్ ఐడియా వేశాడు.పారాగ్లైడింగ్! ట్రాఫిక్‌ను దాటేసి సమర్థను గాల్లోనే కాలేజీ దగ్గర దింపేయొచ్చు అని ఫిక్స్ అయ్యారు.
వేరే దారి లేకపోయేసరికి సమర్థ కూడా ఓకే అనేశాడు.ట్రైన్డ్ పారాగ్లైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పర్యవేక్షణలో టేకాఫ్ అయ్యాడు.అంతే, ఘాట్ రోడ్డు మీద ట్రాఫిక్‌ను జస్ట్ అలా దాటేసుకుంటూ గాల్లోనే దూసుకుపోయాడు.
పరీక్ష టైమ్‌కి కరెక్ట్‌గా కాలేజీ దగ్గర ల్యాండ్ అయిపోయాడు మనోడు.
సమర్థ ఆకాశయానం చేసిన వీడియో సోషల్ మీడియాలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
చాలామంది సమర్థ డెడికేషన్‌ను, అడ్వెంచర్ టీమ్ ఆలోచనను మెచ్చుకుంటున్నారు.
అయితే ఈ ఘటన పసరాని ఘాట్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఎంత పెద్ద సమస్యనో మరోసారి బయటపెట్టింది.
లోకల్స్‌కే కాదు, టూరిస్టులకు కూడా ఇది పెద్ద తలనొప్పి అని జనాలు మాట్లాడుకుంటున్నారు.