టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి29( SSMB29 ) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా అవుతుంది.ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ పనులు హైదరాబాద్ సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఇక రాజమౌళి సినిమా అంటే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది ఈ సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్లో పాల్గొని సెలబ్రిటీ లందరికీ ఇతర ఆర్టిస్టులు అదరికీ జక్కన్న సరికొత్త రూల్ పెట్టినట్టు సమాచారం.ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాతకు కొంతలో కొంత బడ్జెట్ తగ్గించే ప్రయత్నం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడటానికి ఒక అడుగు ముందుకు వేశారు.

సాధారణంగా సినిమా షూటింగ్లో పాల్గొనే ఆర్టిస్టులకు వారికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు ఆర్టిస్టులు పాల్గొంటారట.అయితే వారందరికీ తాగడానికి వాటర్ బాటిల్స్ సప్లై చేయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది అదేవిధంగా పర్యావరణానికి కూడా చాలా హానికరం అని భావించిన జక్కన్న తన సినిమా షూటింగ్లో నో వాటర్ బాటిల్( No Water Bottle ) రూల్ తీసుకువచ్చారని తెలుస్తుంది.
షూటింగ్ లొకేషన్లో ఉన్న వారందరూ కూడా గాజు బాటిల్ తోని నీళ్లు తాగేలా ఒక గాజు బాటిల్ అరేంజ్ చేశారని ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకుండా ఇలా గాదు సీసాలతోని నీళ్లు తాగాలని రోల్ తీసుకు వచ్చినట్టు తెలుస్తుంది.అయితే ఈ నిబంధనలకు నటి ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) మహేష్ బాబు ( Mahesh Babu ) అతిథులు కాదని వారు కూడా ఇదే రూల్ పాటించాలనీ జక్కన్న చాలా స్ట్రిక్ట్ గా చెప్పినట్టు తెలుస్తుంది.
ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ జక్కన్న నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.