న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.ఏపీకి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్( Justice Dhiraj Singh Thakur ), తెలంగాణకు జస్టిస్ అలోక్ అరదే ను కొలీజియం సిఫార్సు చేసింది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines , Gold Rate-TeluguStop.com

2.మాపై దుష్ప్రచారం చేస్తున్నారు : ఈటెల

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

తెలంగాణ బిజెపిలో కొందరు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని , మాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్( Etela Rajender ) అన్నారు.

3.మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రలో చేసిన ఆరోపణలపై వైసీపీ మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.తన ఆస్తులపై వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణానికి తాను సిద్ధమని అనిల్ కుమార్ సవాల్ చేశారు.

4.శ్రీవారి ఆలయంలో అపశృతి

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది మహా ద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది.ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

5.జగన్ ఢిల్లీ పర్యటనపై మంత్రి కామెంట్స్

రాష్ట్ర ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు అన్నారు.

6.ఏపీలో భారీ వర్షాలు

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

7.గంగవరం పోర్ట్ కార్మికుల దీక్షలు

గంగవరం పోర్టులో కార్మికుల దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి .నేడు భవిష్యత్ కార్యాచరణను పోరాట కమిటీ ప్రకటించనుంది.

8.వరంగల్ కు రైల్వే జీఎం

నేడు వరంగల్ కు రైల్వే జీఎం రానున్నారు.ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించనున్న వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్ తో పాటు,  వ్యాగన్ తయారీ యూనిట్ శంకుస్థాపన ఏర్పాటులను జిఎం పరిశీలించనున్నారు.

9.కిషన్ రెడ్డి పర్యటన

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

నేడు కేంద్ర మంత్రి ,బిజెపి తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishanreddy ) ప్రధాని పర్యటన నేపథ్యంలో వరంగల్ లో మూడు రోజులపాటు మకాం వేయనున్నారు.

10.టిడిపి పై మంత్రి కాకాని విమర్శలు

తెలుగుదేశం పార్టీ ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచల విమర్శలు చేశారు.టిడిపి చచ్చిపోయిందని పాడే పట్టడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నారని మంత్రి కాకాని విమర్శించారు.

11.ప్రజల కష్టాలను తీర్చే సత్తా బిజెపికే ఉంది

ప్రజల కష్టాలను తీర్చే సప్త బిజెపికి మాత్రమే ఉందని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు.

12.రేవంత్ రెడ్డి పిలుపు

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బిజెపి , బీఆర్ఎస్ వేల కోట్లు ఖర్చుపెట్టి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాయని వారి కుట్రలను జన బలంతోనే తిప్పికొట్టాలి అని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

13.జగన్ పై యనమల విమర్శలు

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

ఈ అరాచక ముఖ్యమంత్రి పోతే తప్ప,  రాష్ట్రం బాగుపడదని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu ) జగన్ ను ఉద్దేశించి విమర్శించారు.

14.తెలంగాణలో భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపారు.

15.సాయి చంద్ కుటుంబంను పరామర్శించిన కవిత

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి ఛాన్స్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.

1

6.టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని 2017 పిఈటి అభ్యర్థులు ముట్టడించారు.

17.గొర్రెలు కాసిన మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు.అనంతరం మంత్రి మల్లారెడ్డి గొంగడి కప్పుకుని గొర్రెలను కాసి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

18.ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు విద్యార్థుల ఆందోళన

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు.కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధింపులకు గురిచేస్తూ దాడికి పాల్పడుతున్నారని ధర్నాకు దిగారు.

19.చెట్టుకు పుట్టిన రోజు వేడుక

మొదటి విడత హరితహారం లో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ వేల్పూరు మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్కకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు .8 సంవత్సరాల పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు , ప్రజలు, కార్యకర్తలతో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap, Brs, Etela Rajender, Golddhiraj, Jagan, Revanth Reddy, Tdp Chandrabab

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర –  54,250

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 59,160

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube