రెండేళ్ల క్రితం దివంగత క్వీన్ ఎలిజబెత్ IIను( Queen Elizabeth II ) చంపడానికి భారత సంతతికి చెందిన ఓ యువకుడు యత్నిస్తూ దొరికిపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి యూకేలో విచారణ జరుగుతోంది.
ఈ సందర్భంగా క్వీన్‌ను చంపేందుకు తాను ‘స్టార్ వార్స్’ ( Star Wars )నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పడంతో ప్రాసిక్యూటర్లు, న్యాయ సిబ్బంది అవాక్కయ్యారు. జస్వంత్ సింగ్( Jaswant Singh ) ఛాయిల్ అనే యువకుడు 2021 క్రిస్మస్ రోజున రాజ నివాసంలో క్వీన్ ఎలిజబెత్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు.నిందితుడిపై ఇప్పటికే రాజద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు.1981 నుంచి యూకేలో రాజద్రోహానికి పాల్పడిన తొలి వ్యక్తి జస్వంతే.విక్టోరియా మహారాణి హయాంలో ఒక వ్యక్తి ఆమెపై పిస్టల్‌తో గురిపెట్టడంతో 1842లో దేశద్రోహ చట్టం అమల్లోకి వచ్చింది.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మాయని మచ్చగా మిగిలిపోయిన జలియన్ వాలాబాగ్( Jallian Walabagh ) దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాంప్టన్ కు చెందిన ఛాయిల్ నిర్ణయించుకున్నాడు .విండ్సర్ కాజిల్ లో అడుగు పెట్టడానికి ముందు జలియన్‌వాలా బాగ్ మారణకాండకు ప్రతీకారంగానే తాను క్వీన్ ఎలిజబెత్‌ను హత్య చేయాలనుకున్నట్లు ఆ యువకుడు చెప్పాడు.తన పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్ అని, తాను భారతీయ సిక్కునని వివరిస్తూ స్నాప్‌చాట్‌లో వీడియో పోస్ట్ చేశాడు.
జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన వారు, అవమానాలకు గురైనవారి తరఫున ప్రతీకారం తీర్చుకుంటానని జస్వంత్ అన్నాడు.ఈ సమయంలో యువకుడు ముసుగు ధరించి.చేతిలో విల్లువంటి క్రాస్‌బౌ ఆయుధాన్ని పట్టుకున్నాడు.

సోషల్ మీడియాలో జస్వంత్ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.అయితే రాణి నివాసం వరకు వెళ్లేలోపే భద్రతా సిబ్బంది అతనిని పట్టుకున్నారు.అలాగే సౌతాంప్టన్ ప్రాంతంలో ( Southampton )అతని ఇంటికి వెళ్లి సోదాలు జరిపి మరో క్రాస్‌బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే జస్వంత్ మానసిక పరిస్ధితిపై అనుమానాలు రావడంతో అతనిని పోలీసులు మానసిక వైద్యుల పర్యవేక్షణలో వుంచారు.ఈ కేసుకు సంబంధించి గతేడాది ఆగస్ట్ 17న లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో నిందితుడిని హాజరు పరిచారు.
ఛాయిల్ పై 1842 దేశద్రోహ చట్టంలోని సెక్షన్ 2 కింద నేరారోపణలు మోపారు.ఆయుధాలను విడుదల చేయడం లేదా గురిపెట్టడం ద్వారా రాజు లేదా రాణిని ఉద్దేశ్యపూర్వకంగా గాయపరచాలని అనుకోవడం కింద అభియోగాలను నమోదు చేశారు.

అంతేకాదు.తన కుట్రలో భాగంగా రాజకుటుంబానికి దగ్గరగా వుంటూనే క్వీన్ ఎలిజబెత్‌ను చంపాలని నిందితుడు భావించాడు.దీనిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పోలీస్ (ఎండీపీ), బ్రిటీష్ ఆర్మీ, రాయల్ మెరైన్స్, రాయల్ నేవీ, గ్రెనేడియర్ గార్డ్స్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలియజేశారు.క్వీన్ ఎలిజబెత్‌పై హత్యాయత్నానికి సంబంధించి రాజద్రోహ నేరాన్ని జస్వంత్ అంగీకరించడంతో అతనికి ఈ రోజు శిక్ష ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.







