ఇప్పటికైనా అర్థమైందా మనోళ్ళు ఎవరో పగోళ్ళు ఎవరో.ఇదే మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది.
ఆపద ఉన్నప్పుడు అండగా నిలిచే వాడే మనోడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అయితే ఈ చర్చలు ఎవరి గురించి జరుగుతున్నాయో ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది.
మరి ఎవరి గురించో కాదండోయ్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించే.ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలను ఉద్దేశిస్తూ అలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కాగా అల్లు అర్జున్ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ( Former MLA Shilpa Ravi )ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇద్దరు ప్రాణ స్నేహితులు.
ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయడానికి సరే ముందుంటారు.
అలా 2024 సార్వత్రిక ఎన్నికలలో( general election ) అంత కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తున్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆ ప్రసారానికి వెళ్లకుండా తన ఫ్రెండ్ రవి కోసం నంద్యాల వెళ్లి అక్కడ మద్దతు తెలుపుతూ ప్రచార కార్యక్రమాలు చేశారు అల్లు అర్జున్.బాబాయ్ అని పిలుచుకునే పవన్ కోసం కేవలం ట్వీట్ మాత్రమే చేసి ఊరుకున్నాడు బన్నీ.ఇక్కడే మెగాభిమానులు, బన్నీ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలై చినికి చినికి గాలివానగా మారింది.
ఇక అసలు విషయానికొస్తే అల్లు వారబ్బాయి అరెస్ట్ అయ్యాక గొడవలు ఉన్నాయా? లేవా అన్న సంగతి పక్కనెడితే కష్ట కాలంలో అండగా ఉన్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి ఐతే అన్నీ తానై చూసుకున్నారు.
అయితే ఎక్కడా శిల్పా రవి కనిపించక పోవడం గమనార్హం.
అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలింది.ప్రతి ఒకరు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి అల్లు అర్జున్ పరామర్శించారు.ఈ క్రమంలోనే మెగా బ్రదర్స్ చిరంజీవి ,నాగబాబు ( Mega Brothers Chiranjeevi, Nagababu )కూడా స్వయంగా ఇంటికి వెళ్లి మరీ మాట్లాడిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటి వరకూ రెండు కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.ఇక్కడి వరకూ అంతా ఒకే కానీ ఆప్త మిత్రుడు శిల్పా వచ్చి కలిసినట్టు కానీ, కనీసం ఫోన్ చేసి మాట్లాడారని కానీ ఎలాంటి వార్తలు రాకపోవడంతో ఇదేనా స్నేహ బంధానికి అర్థం? అంటూ బన్నీ అభిమానులు మండి పడుతున్నారు.హైదరాబాద్ నుంచి నంద్యాలకు తిరగడానికి తీరిక ఉంటుంది కానీ, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కనీసం పలకరించి మాట్లాడటం లాంటివి అస్సలు లేవు.దీనికి తోడు పుష్ప 2 సినిమా చూడటానికి, పెళ్ళిళ్ళు, రిసిప్షన్లకు హాజరు కావడానికి మాత్రం సమయం ఉంటుంది కానీ మిత్రుడు జైలుకు వెళ్లి వస్తే కనీసం ఇంటికి వెళ్ళడానికి సమయం లేకపోవడం ఏంటి మిత్రమా? అంటూ నంద్యాలకు వచ్చిన సందర్భాన్ని అభిమానులు గుర్తుకు తెచ్చుకుని ఒకింత ఫీల్ అవుతున్నారు.ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఇంత జరిగిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేసుకుని ఉండరా? అనేది పెద్ద డౌట్.ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుండడంతో మెగా అభిమానులు స్పందిస్తూ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మేలు.
ఇక మీదట నేను ఆ తప్పులు చేయకుండా ఉంటే మేలు అంటూ అల్లు అర్జున్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.