హిందువులపై హింస.. బంగ్లాదేశ్‌పై ఆంక్షలు విధించండి, ఇండో అమెరికన్ నేత వ్యాఖ్యలు

షేక్ హసీనాను(Sheikh Hasina) గద్దె దించిన తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్ధితులు దారుణంగా తయారయ్యాయి.ముస్లిమేతర వర్గాలను టార్గెట్ చేసిన అల్లరి మూకలు ఆస్తుల విధ్వంసం, హత్యలు, అత్యాచారాలు, ఆలయాల కూల్చివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

 Indian Origin Us Lawmaker Shri Thanedar Seeks Targeted Sanctions Against Banglad-TeluguStop.com

దీంతో అంతర్జాతీయ సమాజం బంగ్లాదేశ్‌లో(Bangladesh) పరిస్ధితులను నిశితంగా గమనిస్తోంది.అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు.

బంగ్లాదేశ్ (Hindus, Bangladesh)అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికా కాంగ్రెస్(US Congress) సభ్యుడైన శ్రీథానేదర్( Shri Thanedar ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింసకు పాల్పడుతున్న వారిపై ఆంక్షలు విధించాలని యూఎస్ ట్రెజరీ అండ్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లను(US Treasury and State Departments) కోరారు.

ఈ మేరకు బుధవారం యూఎస్ క్యాపిటల్ వద్దకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హిందూ అమెరికన్లను ఉద్దేశించి శ్రీథానేదర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Telugu Bangladesh, Buddhist, Hindu, Hindus, Indianorigin, Sheikh Hasina, Shri Th

ఈ ఏడాది జూలై నుంచి బంగ్లాదేశ్‌లో రాజకీయ హింస పెరిగిందని.ఇది మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, నిష్క్రమణకు దారి తీసిందని ఆయన అన్నారు.నాటి నుంచి బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో కూరుకుపోవడాన్ని తాము చూశామని థానేదర్ అన్నారు.

హిందూ, బౌద్ధ, క్రిస్టియన్ మైనారిటీలు(Hindu, Buddhist, and Christian minorities) హింసాత్మక చర్యలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Bangladesh, Buddhist, Hindu, Hindus, Indianorigin, Sheikh Hasina, Shri Th

మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో శాశ్వత శాంతి, స్ధిరత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోందని థానేదర్ తెలిపారు.కొత్త ప్రభుత్వానికి సంబంధించి తనకు కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ.అమెరికా సాయంతో బంగ్లాదేశ్ ఈ వివాదాలకు శాంతియుత పరిష్కరానాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు శ్రీథానేదర్ ఆకాంక్షించారు.

అణిచివేతకు గురైన వారి పక్షాన పోరాడిన చరిత్ర అమెరికాకు ఉందని ఆయన గుర్తుచేశారు.శాంతిని పునరుద్ధరిస్తానని, సమానత్వం, న్యాయ సూత్రాలపై దేశాన్ని పునర్నిర్మిస్తానన్న వాగ్థానాన్ని నెరవేర్చాలని ప్రధాని మొహమ్మద్ యూనస్‌ను కోరాలని శ్రీథానేదర్ అభిప్రాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube