చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఒక విషప్రయోగం జరిగిందని అప్పట్లో అనేక కథనాలు వెల్లువెత్తాయి.అయితే చిరు పై జరిగిన విష ప్రయోగం గురించి ప్రచురించిన ఒక వార్తా కథనం యొక్క పేపర్ క్లిప్ ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
ఈ వార్తా కథనం లో ఎన్నో తెలియని విషయాలు బయట పడ్డాయి.దీనితో ఈ వార్తలో నిజం ఉందా? అని నెటిజన్లు మరియు మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.ఇంతకీ మెగాస్టార్ పై ఎవరు, ఎప్పుడు, ఎక్కడ విషప్రయోగం చేశారనే విషయాల గురుంచి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి అనతికాలంలోనే తన హార్డ్ వర్క్ మరియు టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలో ఎవరు అందుకో లేనంత స్థాయికి ఎదిగారు.
అయితే ఏ బ్యాక్ గ్రౌండ్ లేని చిరంజీవి ఒక్కడే సినిమా రంగాన్ని ఏలుతున్నారని కొందరు అసూయపడేవారట.ఏ రంగంలోనైనా సరే గొప్ప గా ఎదిగిన వాళ్లపై అసూయ, ఈర్ష్య పెంచుకునే వారు కొందరు ఉంటూనే ఉంటారు.
అయితే 1988వ సంవత్సరంలో చిరంజీవి పై విష ప్రయోగం జరగడానికి కూడా అసూయ, కుట్ర కారణమని కొందరు అంటుంటారు.
అయితే మరణ మృదంగం సినిమా షూటింగ్ లో జరుగుతున్న సమయంలో చిరంజీవి పై విష ప్రయోగం జరిగింది.
మద్రాస్ బేస్ కోర్టులో మరణ మృదంగం సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతున్న సమయంలో చాలామంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు.అయితే షూటింగ్ ముగించుకున్న అనంతరం చిరంజీవి తన అభిమానులకు ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ ఇవ్వడం ప్రారంభించారు.
ఈ సందర్భంలోనే ఓ వ్యక్తి చిరంజీవి ముందుకు వచ్చి.ఈ రోజు తన పుట్టిన రోజు అని.తన బర్త్ డే కేక్ మీ సమక్షంలో కట్ చేయాలని ఉందని అడిగాడు.దీంతో చిరంజీవి ఎంతో ఆప్యాయంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి.
బర్తడే కేక్ కట్ చేయడానికి అనుమతి ఇచ్చాడు.

దీంతో అభిమానిగా చెప్పుకున్న ఆ వ్యక్తి కేక్ కట్ చేసి ఓ కేక్ ముక్కను చిరంజీవి నోట్లో పెట్టబోయాడు.కానీ చిరంజీవి ఆ కేక్ ముక్క ను తినకుండా.ఈ రోజు నీ పుట్టిన రోజు కాబట్టి మొదట నువ్వే తినాలి అని అభిమానికి కేక్ తినిపించబోయారు.
కానీ ఆ అభిమాని కేక్ తినకుండా తోసేసాడు.ఆ సమయంలో కేక్ మొత్తం కిందపడిపోయింది.
అయితే ఆ కేక్ నుంచి ఒక గోధుమ కలర్ ప్యాకెట్ బయటపడడంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు.వెంటనే మరణమృదంగం చిత్రబృందం కూడా అప్రమత్తం అయ్యింది.
ఇదేదో విషప్రయోగంలా ఉందని అందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ అభిమానిని పట్టుకొని చితక్కొట్టారు.అనంతరం పోలీసులకు అప్పగించారు.

అలాగే కేక్ నుంచి బయట పడిన చిన్న ప్యాకెట్ ని పోలీసులకు అప్పజెప్పారు.అయితే ఈ ప్యాకెట్ లో ఉన్నది విషమా కాదా అని తెలుసుకోవడానికి పోలీసులు దానిని లేబరేటరీస్ కి పంపించారు కానీ టెస్ట్ రిజల్ట్స్ ని మాత్రం బయటకు వెల్లడించలేదు.అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న ప్రముఖ వార్తాపత్రికలు చిరంజీవిపై విషప్రయోగం జరిగిందని పెద్దఎత్తున వార్తా కథనాలు ప్రచురించడం ప్రారంభించాయి.దీంతో అప్పట్లో ప్రజలు చిరంజీవి పై జరిగిన విషప్రయోగం గురించి చాలా రోజులు వరకు మాట్లాడుకున్నారు.
కానీ తాను చిరంజీవికి వీరాభిమానినని.తాను ఎటువంటి విషప్రయోగం చేయలేదని తనని నమ్మండి అని ఆ అభిమాని ప్రాధేయపడ్డారు.
అయితే ఈ విషయంపై చిరంజీవి ఏ సందర్భంలోనూ పెదవి విప్పలేదు.మరి నేటి అభిమానుల కోసమేనా ఈ విషయం పై చిరు క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.