మీ కళ్లు ఎక్కువగా అదురుతున్నాయా..? అయితే ఈ సమస్య కావచ్చు..!

సాధారణంగా చెప్పాలంటే అప్పుడప్పుడు చాలా మంది పజలలో కళ్లు( Eyes ) అదురుతూ ఉంటాయి.ఇలా అదిరినప్పుడు ఏదో మంచి జరుగుతుందని పెద్ద వారు చెబుతూ ఉంటారు.

 Are Your Eyes Watering Too Much? But This Could Be A Problem , Eyes , Health ,-TeluguStop.com

కుడి కన్ను అదిరితే చెడు జరుగుతుందని, ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని చెప్పే వారు కూడా ఎంతో మంది ఉన్నారు.కానీ ఇవన్నీ మూడు నమ్మకాలే అని నిపుణులు చెబుతున్నారు.

మీకు ఎప్పుడైతే కళ్లు అదినట్టు అనిపించినా వణికినట్టు అనిపించిన అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీకు తగినంత నిద్రలేదని, స్కీనింగ్ ఎక్కువగా చూస్తున్నారని, అలసట మందులు ఎక్కువగా తీసుకున్న కేఫిన్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న ఇలాంటి సమస్యలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Telugu Caffeine, Coffee, Eyelids, Eyes, Eyes Problems, Tips-Telugu Health Tips

ఇలా ఎక్కువగా కళ్లు అదిరిన, వనికిన మీకు విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య తగ్గాలంటే కళ్లకు కావాల్సినంత విశ్రాంతి ఇవ్వాలి.లేదంటే కాఫీ ( Coffee )లేదా కేఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి.కొన్ని మందులు వాడకం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది.కాబట్టి వైద్యుల సలహాలను తీసుకుంటూ ఉండాలి.అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకండ్ల పాటు అయినా బ్రేక్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అలాగే రెప్పలు వేస్తూ ఉండాలి.ఎప్పుడు కళ్లను రిఫ్రెష్ గా ఉంచుకోవాలి.

దగ్గర లో ఉన్న పచ్చని వస్తువులను చూస్తూ ఉండాలి.

Telugu Caffeine, Coffee, Eyelids, Eyes, Eyes Problems, Tips-Telugu Health Tips

లేదంటే మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.ఇంకా చెప్పాలంటే కళ్లు వణకడం,అదరడం వంటి సమస్యలు దీర్ఘకాలంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.ఇలా ఉంటే మల్టిపుల్ స్ల్కె రోసిస్ లేదా పార్కిన్సన్స్ వ్యాధి( Parkinson’s disease ) లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఇది ఒక్కొక్కసారి మెదడు పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని కూడా చెబుతున్నారు.కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube