మెగా ఇంటి కోడలుగా తాజాగా నటి లావణ్య త్రిపాఠి ( Lavanay Tripati ) అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠిని ప్రేమించే పెద్దల సమక్షంలో నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా ఇటలీల వివాహం చేసుకున్నారు.
ఇలా వీరి వివాహం ఎంతో కన్నుల పండుగగా జరిగింది.ఇక లావణ్య త్రిపాటి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టడంతో ఈమెకు సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి మిస్టర్ ( mister )సినిమాలో నటించారు.ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అయితే వీరి ప్రేమ విషయం బయట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇలా కొంతకాలం పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు వైరి ప్రేమ విషయాన్ని బయట పెడుతూ నిశ్చితార్థపు తేదీని ప్రకటించారు.ఇలా ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నటువంటి ఈ దంపతుల గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యంగా పిల్లల విషయంలో లావణ్య త్రిపాఠి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇదివరకే మెగా కోడలుగా మెగా ఇంటి అడుగుపెట్టినటువంటి ఉపాసన రాంచరణ్ వివాహం చేసుకున్నారు.అయితే వీరి వివాహమైనటువంటి 10 సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కూడా కెరియర్ పరంగా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయట ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ ఫిల్ అయిన తర్వాత ఈమె పిల్లల గురించి ఆలోచించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈమె షోరూం ప్రారంభించి తక్కువ ధరకే అత్యంత ఫ్యాషన్ దుస్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారట.
మరోవైపు ఈమె సినిమాలలో కూడా కొనసాగబోతున్నారని తెలుస్తోంది.అంతే కాకుండా కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ తో స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిందట.ఇలా కెరియర్ పట్ల తన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ ఫీల్ అయిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలని లావణ్య త్రిపాఠి భావించినట్లు తెలుస్తోంది.
ఈమె పిల్లల విషయంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పది సంవత్సరాల తర్వాత ఉపాసన పిల్లలను ప్లాన్ చేసుకున్నారు ఈమె కూడా తన అక్క బాటలోనే పిల్లల విషయంలో నిర్ణయం తీసుకున్నారు అంటూ కొందరు కామెంట్లు చేయగా ఉపాసన ( Upasana ) పది సంవత్సరాలు టైం తీసుకుంటే మీరు మరో 20 సంవత్సరాలు టైం తీసుకుంటారా అంటూ ఈ వార్తలపై కామెంట్స్ చేస్తున్నారు.అయితే మరి కొందరు మాత్రం ఈ విషయం పూర్తిగా వారి వ్యక్తిగతం ఇలాంటి విషయాల పట్ల వారి అభిప్రాయాలు వారికి ఉంటాయి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.