సినిమా ఇండస్ట్రీ లో ఎమ్ జరిగిన చివరికి చీమ చిటుక్కుమన్నా కూడా అందరికి తెలిసిపోతుంది.పిల్లి ఎవరికీ తెలియకుండా పాలు తాగుతున్న అనుకుంటుంది కానీ అది అసాధ్యం కదా.
అందుకే ఏం చేసిన ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అన్ని సినిమాలు వాటి అప్ డేట్స్ ని ఇస్తూ ఉంటాయి.ఇందుకు చిన్న హీరోలు మరియు పెద్ద హీరోలు ఎవ్వరు కూడా అతీతం కాదు.
ఎటొచ్చి మీడియా చేతికి ముఖ్యం గా ఈ సోషల్ మీడియా చేతికి చిక్కకుండా, దొరక్కుండా చూసుకోవాలి.నిన్నటికి నిన్న మహేష్ బాబు( Mahesh Babu ) సినిమా సోషల్ మీడియా చేతికి దారుణం గా దొరికిపోయింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో గుంటూరు కారం సినిమా లో మహేష్ బాబ నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

అతడు, ఖలేజా ( Khaleja )సినిమా తర్వాత ఇన్నేళ్ల కు వస్తున్న సినిమా కావడం తో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేవు.అతడు చిత్రం మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఖలేజా థియేటర్స్ లో ఫెయిల్ అయ్యింది.అయితే ఈ మూడవ చిత్రం పై అభిమానుల్లో బాగా అంచనాలు ఉన్నాయ్.
మహేష్ బాబు కి ఇది 28 వ సినిమా కాగా నిన్న సూప్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు గ్లిమ్ప్స్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది.అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది.
ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా హైలీ ఇన్ ఫ్లెమబుల్( highly inflammable ) అంటూ పెట్టారు.అయితే ఇదే ట్యాగ్ లైన్ తో 16 ఏళ్ళ క్రితమే తారక్ హీరో గా కృష్ణ వంశి( Krishna Vamsi ) దర్శకత్వం లో రాఖి అనే సినిమా వచ్చింది.
ఇది లేడీ ఫాలోయింగ్ ని పెంచుకున్న సినిమా.

దాంతో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సినిమా ట్యాగ్ ని త్రివిక్రమ్ ఎలా కాపీ కొట్టాడంటూ మీడియా లో పెద్ద చర్చ జరుగుతుంది.మహేష్ బాబు కోసం గుంటూరు బ్యాగ్రౌండ్ తో మంచి పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా తీస్తున్నత్రివిక్రమ్ ఈ మాత్రం చూసుకోకుండా ఎలా ఒకటే ట్యాగ్ ని వాదిస్తారు అంటూ అయన ఫ్యాన్స్ కూడా విమర్శలు ఎక్కు పెడుతన్నారు.పైగా రాఖి సినిమా చాల పెద్ద హిట్టు.
ఇంత కేర్ లెస్ గా ట్యాగ్స్ పెడితే సినిమా ఎలా ఉండబోతుందో అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
