అతి ఆకలి.ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధించే సర్వసాధారణమైన సమస్య ఇది.అయితే చాలా మంది దీనిని పెద్ద సమస్యగా భావించారు.కానీ అతి ఆకలి వల్ల నోరు కట్టుకోలేక దేనిని పడితే దాన్ని లాగించేస్తుంటారు.
దాంతో భారీగా బరువు పెరుగుతారు.బరువు పెరిగితే మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, క్యాన్సర్ తదితర వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు పెరుగుతాయి.
అందుకే అతి ఆకలి సమస్యను నివారించుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అతి ఆకలి సమస్యకు చెక్ పెట్టడం లో అద్భుతంగా సహాయపడుతుంది.
మరియు ఎన్నో ఆరోగ్య లాభాలను సైతం అందిస్తుంది.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఎప్పుడు ఆ డ్రింక్‌ను తీసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు, వన్ టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ వేరుశెనగలు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయం నానబెట్టుకున్న పదార్థాలను ఒకటి లేదా రెండు సార్లు వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకుని బ్లెండర్ లో వేసుకోవాలి.

అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ కొబ్బరి పాలు కూడా బ్లెండర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే.హెల్తీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ డ్రింక్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.
ప్రతి రోజు ఈ హై ప్రోటీన్ డ్రింక్ ను తీసుకుంటే కనుక శరీరం యాక్టివ్ గా ఉండేందుకు అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి.తద్వారా అతి ఆకలి సమస్య క్రమంగా దూరం అవుతుంది.