టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న హీరో రామ్ చరణ్.( Ram Charan ) తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకొని మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు.
వ్యక్తిగతంగా కూడా రామ్ చరణ్ మనసు చాలా మంచిది.తనకోసం తన ఇంటి వరకు వచ్చే అభిమానులను కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్లను హగ్ చేసుకుని మరి దగ్గరికి తీసుకుంటాడు.
అటువంటి రామ్ చరణ్ గురించి ఒక డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆయనపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.ఇంతకు అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రామ్ చరణ్ కు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది.
అదే జంజీర్ ( Zanjeer Movie ) సినిమా.ఈ సినిమా 2013లో తెలుగులో తుఫాన్ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ అపూర్వ లిఖియా( Director Apoorva Lakhia ) రూపొందించాడు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేయగా సినిమా విడుదల తర్వాత డిజాస్టర్ గా మారింది.దీంతో చరణ్ కు ఇది పెద్ద వరస్ట్ సినిమా అని అప్పట్లో అభిమానులు చెప్పుకొచ్చారు.
అయితే ఆ సమయంలో డైరెక్టర్ అపూర్వ లిఖియా రామ్ చరణ్ పై ఫైర్ అయినట్లు తెలిసింది.

రామ్ చరణ్ ఏదైనా సినిమా ఫ్లాపైతే ఆ డైరెక్టర్లను హేళనగా చూస్తాడని.రంగులు మార్చే ఊసరవెల్లి అని అట్టర్ ఫ్లాప్ అయ్యాక కనీసం డైరెక్టర్ల మొఖం కూడా చూడడని.డైరెక్టర్లతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడని.
ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయడని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు అని అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి.ఆ సమయంలో ఆయనపై మెగా అభిమానులు చాలా ఫైర్ అయ్యారు.

అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ అపూర్వ. నిజానికి రామ్ చరణ్ నేను దూరంగా ఉన్నాం అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని.చాలామంది మేము ఇద్దరం దూరంగా ఉన్నామంటూ ప్రచారం చేస్తున్నారని అన్నాడు.కానీ నేను ఇప్పటికి హైదరాబాద్ వెళ్లిన వాళ్ల ఇంట్లోనే స్టే చేస్తానని.చరణ్ ను ఖచ్చితంగా కలుస్తానని అన్నాడు.అంటే వీరిద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు అని.కావాలనే వీరిద్దరి మధ్య ఎవరో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారని తెలుస్తుంది.

దీంతో మెగా అభిమానులు ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు కూల్ అయ్యారు.ఇక ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇక త్వరలో ఈయన తండ్రి కాబోతున్నాడు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే.
మొత్తానికి చరణ్ కు ఇప్పుడు అదృష్టం వెన్నంటే ఉందని అర్థమవుతుంది.







