జుట్టు తెల్ల‌బ‌డ‌టానికి ఈ పోష‌కాల కొర‌తా కార‌ణ‌మే..జాగ్ర‌త్త!

యాబై ఏళ్లు దాటాయంటే స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రూ ఫేస్ చేసే కామ‌న్ స‌మ‌స్య తెల్ల జుట్టు.

వ‌య‌సు పెరిగే కొద్ది శ‌రీరంలో వ‌చ్చే మార్పుల వ‌ల్ల జుట్టు క్ర‌మ‌క్ర‌మంగా తెల్ల‌బ‌డుతూ ఉంటుంది.

అయితే ఈ మ‌ధ్య కాలంలో ఇర‌వై, ముప్పై ఏళ్ల వారు సైతం తెల్ల జుట్టు స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.అధిక ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, కాలుష్యం, జుట్టు సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం, జీవ‌న శైలిలో మార్పులు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్ వాడ‌కం వంటివే జుట్టు తెల్ల బ‌డ‌టానికి కార‌ణాలుగా భావిస్తారు.

కానీ, కొన్ని పోష‌కాలు లోపించ‌డం వ‌ల్ల కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డిపోతుంది.ముఖ్యంగా శ‌రీరంలో విటమిన్‌ బి 12 మ‌రియు ఐర‌న్ వంటి పోష‌కాల కొర‌త ఏర్ప‌డితే.

ఆ ప్ర‌భావం జుట్టుపై తీవ్రంగా ప‌డుతుంది.ఈ క్ర‌మంలోనే కేశాలు బ‌ల‌హీన ప‌డ‌టం మ‌రియు తెల్ల బ‌డ‌టం జ‌రుగుతుంది.

Advertisement

అందు వ‌ల్ల‌నే, శ‌రీరానికి స‌రిప‌డా విటమిన్‌ బి 12 మ‌రియు ఐర‌న్ ను అందించాల్సి ఉంటుంది.పాలు, పెరుగు, చీజ్, గుడ్డు, చేప‌లు, రెడ్ మీట్‌, క్య్రాబ్స్, బీఫ్, చికెన్ లివర్‌, సోయా విత్త‌నాలు, సోయా పాలు, ఇత‌ర సోయా ప్రోడెక్ట్స్‌, కొబ్బ‌రి తో పాటు, తృణధాన్యాలు వంటి ఆహారాల్లో విట‌మిన్ బి 12 పుష్క‌లంగా ఉంటుంది.

కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే శిరోజాలు తెల్లబ‌డ‌కుండా ఉంటాయి.మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూర‌మై జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

అలాగే దానిమ్మ‌, నువ్వులు, బీట్‌‌రూట్, క్యారెట్‌, జామ పండ్లు, అరటి పండ్లు, ఖ‌ర్జూరం, కిస్‌మిస్, బెల్లం, పాలకూర, బ్రొకోలీ, మెంతి కూర, ట‌మాటా, నారింజ, వేరుశెన‌గ‌లు, వాల్‌నట్, బాదం ప‌ప్పు వంటి ఆహారాల్లో ఐర‌న్ స‌మృద్ధిగా ఉంటుంది.వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శ‌రీరంలో ఐర‌న్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.ఫ‌లితంగా జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు