అధిక బరువు.ఈ సమస్య మగవారికన్నా ఆడవారే ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు.
లావుగా ఉండడం తప్పు కాదు.కానీ, లావుగా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
నిజానికి మనకు వచ్చే అనారోగ్య సమస్యలకు 84 శాతం అధిక బరువే కారణం.అందుకే బరువు తగ్గడం చాలా ముఖ్యం అని అంటారు నిపుణులు.
అలా తగ్గినప్పుడే ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండగలరు.అయితే ముఖ్యంగా మహిళలు వేగంగా బరువు తగ్గాలి అని అనుకునే వారు కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఆహార పదార్థాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
వెల్లుల్లి.
ఎన్నో పోషకాలు దాగున్న ఈ వెల్లుల్లి అనేక జబ్బుల నుంచి రక్షిస్తుంది.వెల్లుల్లిలో ఉండే విటమిన్ బి6, విటమిన్ సి మరియు ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రతి రోజు రెండు లేదా మూడు వెల్లుల్లి రెమ్మలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వును కరిగిస్తుంది.తద్వారా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది.
అలాగే క్యారెట్ కూడా బరువును తగ్గించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.

క్యారెట్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.ప్రతి రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాదు.ఎక్కవ సమయం పాటు ఎనర్జిటిక్‌గా ఉంటారు.
ఇక త్వరగా బరువు తగ్గాలనుకునే మహిళలు ఖచ్చితంగా డైట్‌లో ఆకుకూరలు తీసుకోవాలి.ఎందుకంటే.
ఆకుకూరల్లో కేలరీలు తక్కువగా.ఫైబర్ ఎక్కువ ఉంటుంది.
ఈ ఫైబర్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.తద్వారా వేరే ఆహారాలు తీసుకోలేరు.
ఫలితంగా బరువు తగ్గవచ్చు.
యాపిల్, స్ట్రాబెర్రీస్ మరియు పియర్స్.
ఈ మూడు పండ్లు డైట్‌లో చేర్చుకోవడం వల్ల అతి ఆకలి తగ్గించుకోవచ్చు.అదే సమయంలో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.
అలాగే రైస్‌కు బదులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్‌ను తీసుకోవాలి.ప్రతీ రోజు ఉదయం నిమ్మ రసం మరియు తేనే కలుపుకొని తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
ఇక వీటితో పాటు రోజుకు కనీసం ఇరవై నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి.అప్పుడే బరువు తగ్గగలరు.