టాలీవుడ్ సినీ అభిమానులకు రకుల్ ప్రీత్ సింగ్ (rakul preet singh)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.దశాబ్దానికి పైగా కెరీర్ ను విజయవంతంగా కొనసాగించిన హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు.
కెరటం(Keratam) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రయాణం మొదలుకాగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్(Venkatadri Express) సినిమాతో తొలి సక్సెస్ దక్కింది.
మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్(Mahesh Babu, Ram Charan, Allu Arjun, Jr.NTR) లకు జోడిగా నటించిన ఈ బ్యూటీ భారీగానే విజయాలను ఖాతాలో వేసుకున్నారు.అయితే స్పైడర్, మన్మధుడు2 సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ కావడం రకుల్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.
గతేడాది రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భాగ్నాని పెళ్లి సింపుల్ గా జరిగిన సంగతి తెలిసిందే.అయితే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సింపుల్ గా పెళ్లి చేసుకోవడం గురించి రకుల్ క్లారిటీ ఇచ్చారు.

నేను నా భర్త సింపుల్ గా ఉండాలని కోరుకుంటామని మేము కంఫర్టబుల్ గా ఉండటానికి ఇష్టపడతామని రకుల్ పేర్కొన్నారు.ఎక్కువ లగ్జరీగా ఉండాలని మేము ఎప్పుడూ కోరుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు.మధురమైన క్షణాలు, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా విలువ ఇస్తామని రకుల్(Rakul) చెప్పుకొచ్చారు.మా పెళ్లిని అతిథులతో కలిసి ఆస్వాదించాలని పెళ్లి జరిగిన మూడు రోజులు మా లైఫ్ లో గుర్తుండిపోవాలని ఫీలయ్యామని అభిప్రాయపడ్డారు.
అందువల్లే నో ఫోన్ పాలసీ ప్రవేశపెట్టామని అలాగే పెళ్లిలో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశామని అన్నారు.పెళ్లి దుస్తులు ధరించి కూడా డాన్స్ చేశానని రకుల్ వెల్లడించారు.

రకుల్ నటించిన మేరే హస్బెండ్ కి బివి(Mere Husband Ki Biwi) సినిమా ఈ నెల 22 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రకుల్ ఈ విషయాలను వెల్లడించారు.రకుల్ తెలుగు సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా తెలుగులో ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.రకుల్ రెమ్యూనరేషన్ సైతం గతంతో పోల్చి చూస్తే తగ్గిందని తెలుస్తోంది.