రాజమౌళి చేసిన మాయతో త్రిబుల్ ఆర్ కి నిర్మాత ఎవరు అనే విషయం కూడా సామాన్య ప్రజలకు తెలియకుండా పోయింది.ఆర్ఆర్ఆర్ సినిమా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేవి కేవలం రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.
మరీ ముఖ్యంగా ఈ మధ్య గోల్డెన్ క్లోబ్ అవార్డు అందుకున్నాడు కాబట్టి కీరవాణిని కాస్త గుర్తిస్తున్నారు జనాలు.లేదంటే హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అన్ని క్రెడిట్ కూడా రాజమౌళికే.
ఇక ఆ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ప్రోమోలు, పోస్టర్లు, ప్రమోషన్స్, సక్సెస్ మీట్స్ ఇలా ఇన్ని జరుగుతున్నా కూడా ఆర్ఆర్ఆర్ నిర్మాత మాత్రం ఎక్కడా కనిపించలేదు.

ఒక దిల్ రాజు లాంటి నిర్మాత సినిమా తీస్తే ఇలా నిర్మాత హడావిడి లేకుండా ఉంటుందా చెప్పండి.ఆర్ఆర్ఆర్ సినిమాకి నిర్మాత బయట కనిపించలేదు సరే ఒప్పుకుందాం పోనీ స్టేజి పైన మాట్లాడిన పెద్దలు ఎవరైనా కూడా నిర్మాత గురించి మాట్లాడి ఉంటే బాగుండేది.ఏ ఒక్కరూ నిర్మాత గురించి, ఆయన తీసిన సినిమాల గురించి లేదా ఆయన ఇస్తున్న ఫ్రీడమ్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.
సినిమా వేలకోట్ల వసూలు సాధిస్తున్న, దేశ విదేశాల్లో ప్రచారం చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్న కూడా ఈ సినిమా నిర్మాత ఏ ఒక్కచోట తన గురించి మాట్లాడలేదు, స్టేజి పైకి రాలేదు.కేవలం రాజమౌళి మాత్రమే సినిమాలో ఎక్కువ భాగం హైలైట్ అవుతూ వచ్చాడు.
అంతేకాదు రాజమౌళి సినిమాలకు మట్టుకు ప్రొడ్యూసర్ కేవలం ఒక ఫైనాన్షియల్ మాత్రమే.

రాజమౌళి నిర్మాత విషయంలో అంత ట్రిక్ ప్లే చేశాడా అంటే అనుమానమే.కొంతమంది తాము పెడుతున్న డబ్బుకు, వస్తున్న కలెక్షన్స్ తో బాగా సంపాదిస్తున్నారు అనే ముద్రపడి ఇన్కమ్ టాక్స్ దాడుల భయం పట్టుకొని కూడా ఎక్కువగా మీడియాలో హైలెట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటారు.ఇంతకు ఈ సినిమా నిర్మాత ఎవరు అని అనుకుంటున్నారా అతడి పేరే డివివి దానయ్య అలియాస్ దాసరి వీర వెంకట దానయ్య.
పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన దానయ్య టాలీవుడ్ లో మంచి క్రెడిబిలిటీ ఉన్న నిర్మాత.అయినా కూడా రాజమౌళి డామినేషన్ తో పూర్తిగా మొహం కూడా కనిపించడం అంత సైలెంట్ అయిపోయాడు.