చుండ్రు.ఒక్కసారి పట్టుకుందంటే ఓ పట్టాన పోనే పోదు.
స్త్రీలే కాదు ఎందరో పురుషులు సైతం ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు.చుండ్రు వల్ల తల తరచూ దురద పెట్టడం, హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ ఆగిపోవడం, జుట్టు డ్రై అయిపోవడం, ముఖంపై మొటిమలు వంటి ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అందుకే చుండ్రును నివారించుకోవడం కోసం రకరకాల చిట్కాలను పాటిస్తుంటారు.ఒక్కోసారి ఎన్ని చేసినా చుండ్రు పోదు.
దాంతో కొందరు ట్రీట్‌మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క రెమెడీని ప్రయత్నిస్తే గనుక.
కేవలం రెండు వారాల్లోనే చుండ్రును పోగొట్టుకుని జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చు.మరి లేటెందుకు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన అల్లం ముక్కను సన్నగా తురుముకుని.
ఆ తురుము నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
చివరిగా ఇందులో మీ రెగ్యులర్ షాంపూను ఓ మూడు టేబుల్ స్పూన్ల చప్పున వేసి మళ్లీ కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని యూస్ చేసి కళ్లల్లో పడకుండా చాలా జాగ్రత్తగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఈ విధంగా నాలుగు రోజులకు ఒకసారి చేస్తే అల్లం మరియు ఆపిల్ సైడర్ వెనిగర్‌లో ఉండే ప్రత్యేక సుగుణాలు చుండ్రును క్రమంగా తరిమి కొడుతాయి.అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి.కాబట్టి, ఇకపై చుండ్రును పోగొట్టుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేసే బదులు.ఈ సింపుల్ చిట్కాను ట్రై చేస్తే మంచి ఫలితాన్ని పొందొచ్చు.