నెలసరి నొప్పులను మాయం చేసే మ్యాజికల్ డ్రింక్ ఇది.. దీని ముందు పెయిన్ కిల్లర్స్ కూడా బలాదూర్!

సాధారణంగా కొందరు మహిళలకు నెలసరి చాలా కష్టంగా గడుస్తుంది.ఆ సమయంలో నడుము నొప్పి, పొత్తి కడుపు నొప్పి, కాళ్లు చేతులు విపరీతంగా లాగేయడం, తలనొప్పి ఇలా అనేక నొప్పులతో సతమతం అయిపోతుంటారు.

 Magical Drink To Relieve Menstruation Pain! Magical Drink, Menstruation Pain, Pe-TeluguStop.com

ఏ పని చేయలేకపోతుంటారు.అందుకే నెలసరి సమయం దగ్గర పడుతుంది అంటేనే తెగ భయపడిపోతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇక‌పై అస్సలు చింతించకండి.నెలసరి నొప్పులను మాయం చేసే మ్యాజికల్ డ్రింక్ ఒకటి ఉంది.దీని ముందు పెయిన్ కిల్లర్స్ కూడా బలాదూర్.

Telugu Tips, Latest, Magical, Pain, Period, Periods-Telugu Health

ఈ డ్రింక్ ను నెలసరి సమయంలో తీసుకుంటే ఎలాంటి నొప్పులైనా పరార్ అవ్వాల్సిందే.మరి లేటెందుకు ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం( Ginger ), హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క( Cinnamon ) పొడి, రెండు దంచిన నల్ల యాలకులు, పావు టేబుల్ స్పూన్ కరక్కాయ పొడి, నాలుగు దంచిన మిరియాలు, రెండు లవంగాలు, చిటికెడు పసుపు వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Tips, Latest, Magical, Pain, Period, Periods-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.నెలసరి సమయంలో రోజుకు ఒక కప్పు చొప్పున ఈ డ్రింక్ ను తీసుకోవాలి.నెలసరి నొప్పులకు ఈ డ్రింక్ న్యాచురల్ పెయిన్ కిల్లర్ లా పనిచేస్తుంది.ఎలాంటి నొప్పులు ఉన్న సరే తగ్గుముఖం పడతాయి.బాడీ ఫ్రీగా మారుతుంది.

అలాగే ఒత్తిడి, చిరాకు వంటివి దూరం అవుతాయి.మెదడు, మనసు ప్రశాంతంగా మారతాయి.

కాబట్టి నెలసరి సమయంలో నొప్పులతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ డ్రింక్ ను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube