రమ్యకృష్ణ( Ramya Krishna )… నాటి నీలాంబరి నేటి శివగామి.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే కాదు యావత్ ఇండియాలోనే చెప్పుకోదగ్గ నటి.
ఆమె స్థాయి శివగాఇంతొ అగ్ర శిఖరాన్ని చేరుకుంది.మరి ఈ స్థాయికి రావడానికి ఆమెకు ఎంతో సహాయం చేసింది మాత్రం దర్శకేంద్రులు కె రాఘవేంద్ర రావు గారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.
మరి ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తీసుకచ్చి, ఎన్ని సినిమాల్లో అవకాశం ఇచ్చారో అందరికి తెలిసిందే.అయితే ఆమె స్టార్ నటీమణి గా చేయమని అవ్వడానికి రాఘవేంద్ర రావు ( Raghavendra Rao )డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
అల్లుడు గారు
మొట్టమొదటి సారి మోహన్ బాబు హీరో గా రమ్యకృష్ణ రెండు పాత్రల్లో నటించిన సినిమా అల్లుడు గారు( alludu garu ).ఈ సినిమా ఆమెకు మంచి పేరును తీసుకచ్చింది.ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది.

అల్లరి ప్రియుడు
రాఘవేంద్ర రావు తీసిన మరొక అద్భుతమైన చిత్రం అల్లరి ప్రియుడు( allari priyudu ).ఈ సినిమా లో ఫ్రెండ్ కోసం ప్రేమించిన వాడిని త్యాగం చేసే అద్భుతమైన పాత్రలో రమ్య కృష్ణ చాల చక్కగా నటించారు.

మేజర్ చంద్రకాంత్
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో రమ్య కృష్ణ హేమ( Hema ) అనే పాత్రలో నటించగా, చిన్న పాత్రా అయినా కూడా మంచి పేరును తీసుకచ్చింది.

అన్నమయ్య
నాగార్జున ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ తిమ్మక్క పాత్రలో నటించిన అన్నమయ్య( Annamayya ) సినిమాను రాఘవేంద్ర రావు దర్శకత్వం వచించారు.భక్తిరస చిత్రంలో రమ్యకృష్ణ ఎంతో చక్కగా నటించారు.

బాహుబలి
ఇక శివగామిగా రమ్య కృష్ణ నటించిన బాహుబలి( Bahubali ) సినిమాను రాఘవేంద్ర రావు సహా నిర్మతగా వ్యవహరించారు.ఈ సినిమాలో ఆమె పాత్రకు గాను ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించడం తో పాటు ప్రస్తుతం ఆమె చాల పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తున్నారు.