సమాజంలో పోలీసులను( Police ) గౌరవంగా చూస్తారు.వారు న్యాయం కోసం శ్రమించేవారు కావడంతో.
చాలా మంది యువత పోలీసు ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నిస్తారు.కానీ, కొంతమంది పోలీసుల ప్రవర్తన కారణంగా మొత్తం డిపార్ట్‌మెంట్‌పై చెడ్డపేరు పడుతుంది.
సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయిస్తారు.అయితే, కొన్నిసార్లు పోలీసులే ప్రజల ముందు తగని విధంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో( Uttar Pradesh ) జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనం.
తాజగా ఉత్తరప్రదేశ్ లోని కాసర్‌గంజ్‌లో ఓ సబ్-ఇన్‌స్పెక్టర్( Sub Inspector ) మద్యం మత్తులో బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించాడు.బస్ స్టాప్‌లో పూర్తిగా మద్యం మత్తులో( Drunk ) కూర్చున్న అతడిని అదుపు చేయడానికి భార్య ప్రయత్నించింది.అయితే, అతను ఆమెను హత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేయడం మొదలు పెట్టాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ సబ్-ఇన్‌స్పెక్టర్ నడి రోడ్డు మీద ఉండి కూడా తన ప్రవర్తనను నియంత్రించుకోలేకపోయాడు.
అతని చర్యలను పలువురు తమ ఫోన్లలో రికార్డు చేశారు.ఈ క్రమంలో, అతడిని ప్రశ్నించిన వారిపై అతనే తిడుతూ, దురుసుగా ప్రవర్తించాడు.
అతని పోలీస్ టోపీ కూడా దూరంగా పడిపోయింది.ఈ ఘటనపై యూపీ పోలీసులు సీరియస్ అయ్యారు.మద్యం మత్తులో అధికారిక విధులు విస్మరించినందుకు సంబంధిత ఎస్ఐ పై విచారణ చేపట్టి, అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ అధికారిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ ఘటన మరోసారి పోలీసుల తగిన ప్రవర్తనపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.కొన్ని వ్యక్తుల తప్పిదాల వల్ల మొత్తం డిపార్ట్‌మెంట్‌పై నెగెటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది.
పోలీసులు తమ బాధ్యతను గుర్తుంచుకుని ప్రజలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.