జబర్దస్త్( Jabardasth ) షో ద్వారా ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో వర్ష( Varsha ) ఒకరు.వర్ష కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
అయితే ఆరేళ్ల క్రితం తనకు ఎదురైన అవమానం గురించి జబర్దస్త్ వర్ష షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.కొంతమంది నన్ను కూడా బాధ పెట్టారని నా ముందు ఒకలా వెనుక మరోలా బిహేవ్ చేశారని వర్ష చెప్పుకొచ్చారు.
తెలిసిన వాళ్లే ఆ విధంగా బిహేవ్ చేసేవారని ఆమె తెలిపారు.ఒక ఈవెంట్ లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని చెబితే ఫ్లైట్ టికెట్ వేసుకుని మరీ వెళ్లానని కనీసం నాకు డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేయించలేదని ఆమె తెలిపారు.
నన్ను పిలవకుండా స్టేజ్ వెనుకే ఉంచారని ఒక ఆర్టిస్ట్ వచ్చి రెడీ అవుతానని అద్దం పట్టుకోవాలని కోరారని గంట సేపు ఆ ఆర్టిస్ట్ కు అద్దం పట్టుకున్నానని జబర్దస్త్ వర్ష కామెంట్లు చేశారు.

నా ప్రోగ్రాం లేకపోయినా నన్ను ఈవెంట్ కోసం పిలిచి బాధ పెట్టారని ఆమె చెప్పుకొచ్చారు.జబర్దస్త్ షో ద్వారా పేరు సంపాదించుకున్న తర్వాత తాను కోరుకున్నవి అన్నీ దక్కాయని ఆమె తెలిపారు.ముందు ఒక విధంగా వెనుక ఒక విధంగా బిహేవ్ చేసే వాళ్ల వల నేను ఇబ్బందులు పడ్డానని జబర్దస్త్ వర్ష పేర్కొన్నారు.
జబర్దస్త్ వర్ష పారితోషికం ప్రస్తుతం బాగానే ఉంది.