నిద్రపోతూనే డ్రైవింగ్.. వెస్ట్ బెంగాల్ వ్యక్తి రూపొందించిన బెడ్ కారు అదుర్స్..

ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడు మనల్ని షాక్‌కి గురిచేస్తూనే ఉంటుంది.ముఖ్యంగా మన భారతీయుల టాలెంట్, తెలివితేటలు చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.

 West Bengal Man Turns Bed Into Car Video Viral Details, Motorized Bed Car, Bed C-TeluguStop.com

అలాంటి ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేంటంటే, రోడ్డు మీద చక్కగా తిరిగే మోటరైజ్డ్ మంచం.

( Motorized Bed Car ) నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం.వెస్ట్ బెంగాల్‌లోని( West Bengal ) ముర్షిదాబాద్‌కు చెందిన నబాబు ఎస్కే అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు.

వైరల్ అవుతున్న వీడియోలో( Viral Video ) నబాబు ఎస్కే ఒక మంచం లాంటి వాహనంపై చాలా హాయిగా వీధుల్లో తిరుగుతూ కనిపించాడు.ఇది మామూలు మంచం కాదు సుమా.

స్టీరింగ్ సిస్టమ్, బ్రేకులు అన్నీ ఉన్నాయి దీనికి.చిన్న కారులా స్మూత్‌గా వెళ్తుండడం చూస్తే ఆశ్చర్యపోతారు.

కాకపోతే ఇది చూడటానికి మాత్రం అచ్చంగా మంచంలా ఉంటుంది అంతే, మంచం మీద ప్రయాణం ఏంటి అనుకుంటున్నారా? ఇదిగో మీ కళ్ల ముందే సాక్ష్యం.

మోటరైజ్డ్ మంచం చూడటానికి మామూలుగా మన ఇంట్లో ఉండే మంచంలాగే ఉంటుంది.పరుపు, కలర్‌ఫుల్ బెడ్‌షీట్, మెత్తటి దిండ్లు కూడా ఉన్నాయి.అంతేకాదు రోడ్డు మీద వెళ్లడానికి రెడీగా ఉండాలి కదా, అందుకే ఫుట్‌బోర్డ్‌కు రెండు సైడ్ మిర్రర్లను కూడా అమర్చాడు.

ఫన్నీగా ఉండటంతో పాటు ఫంక్షనల్‌గా కూడా ఉంది.

వీడియోలో హైలైట్ మూమెంట్ ఏంటంటే.నబాబు ఎస్కే మంచం కదులుతుండగానే ఒక్కసారిగా నిలబడి బాలీవుడ్ స్టైల్‌లో షారుఖ్ ఖాన్ లాగా చేతులు చాపి మరీ కూర్చున్నాడు.అబ్బో.

ఆ స్వాగ్ మామూలుగా లేదు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చాలామంది ఈ క్రియేషన్‌కు ఫిదా అయిపోయారు.నవ్వు ఆపుకోలేకపోతున్నారు.“లేట్‌గా లేచి నేరుగా బెడ్‌పైనే ఆఫీస్‌కు వెళ్లొచ్చు” అని ఒకరు కామెంట్ చేస్తే, “ఇది లగ్జరీ అంటే.ఇండియా బిగినర్స్ కోసం కాదు” అంటూ మరొకరు పంచ్ డైలాగ్ వేశారు.

కొందరు మాత్రం సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు.“నిద్రపోతూ డ్రైవింగ్ చేసినందుకు ఫైన్ వేయకుండా ఉంటారా?” అని ఒకతను సెటైర్ వేశాడు.ఏదేమైనా ఈ మోటరైజ్డ్ మంచం మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.భారతీయుల క్రియేటివిటీకి హద్దుల్లేవని మరోసారి నిరూపితమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube