టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) ఇటీవల గేమ్ చేంజర్( Game Changer ) మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చి బాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో( Peddi Movie ) నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వెండితెరకు పరిచయమైన మొదటి సినిమా చిరుత.( Chirutha Movie ) ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.ఇక ఇందులోని సాంగ్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.నేహా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈ సినిమాకు ముందుగా రామ్ చరణ్ ఛాయిస్ కాదని అంతకంటే ముందే టాలీవుడ్ యంగ్ హీరో కోసం ఈ స్టోరీని రెడీ చేసుకున్నారని ప్రముఖ సీనియర్ రచయిత తోట ప్రసాద్( Thota Prasad ) ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తోట ప్రసాద్ మాట్లాడుతూ.

చిరుత కథ మొదట పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్( Sairam Shankar ) హీరోగా అనుకున్నారు.ఆ కథను ముందుగా మెహర్ రమేష్ రాసుకున్నాడు.బ్యాంకాక్ వెళ్లి అక్కడ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారు.కానీ పలు కారణాలతో ఆ సినిమా ఆగిపోయింద అని చెప్పుకొచ్చాడు.ఇక ఆ తర్వాత అదే కథ చిరంజీవి దగ్గరికి వెళ్లిందని, నిర్మాత అశ్వినీదత్ కు మెహర్ రమేష్ దగ్గర ఆ కథ ఉందని తెలిసీ దాని గురించి పూరి జగన్నాథ్ కు కూడా ఐడియా ఉండడంతో రామ్ చరణ్ కు కరెక్ట్ గా సరిపోతుందని భావించి చిరు వద్దకు తీసుకెళ్లారట.చిరంజీవి తన తనయుడిని దృష్టిలో పెట్టుకుని కథలో కొన్ని మార్పులు చేసి హీరోను మరింత మాస్ గా చూపించడంతో చిరు ఒకే చేశారని పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని కోరడంతో పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారట.
అలా ఈ సినిమాను రామ్ చరణ్ పూర్తి చేశారట.సాయి రామ్ శంకర్ తో ఈ సినిమాను తీసేటప్పుడు ఈ మూవీ స్టోరీ టైటిల్ చిరుత కాదని.
సినిమా ఆగిపోయాకే ఆ కథ మార్చి చిరుత టైటిల్ పెట్టారని అన్నారు.ఆ సినిమా సాయి రామ్ శంకర్ కు పడి ఉంటే కచ్చితంగా ఆయన కెరీర్ టర్న్ అయ్యి ఉండేదని అంటున్నారు ఫ్యాన్స్.