మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కి తగ్గట్టుగా మారాల్సి ఉంటుంది.లేదు నేను ఇంతవరకే నటిస్తాను ఇలానే నటిస్తాను అలాంటి పాత్రలు చేయను అంటే కష్టమే అని చెప్పాలి.
అందుకే కొన్ని కొన్ని సార్లు కొంతమంది పాత్రలు డిమాండ్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో హద్దులు చెరిపి మరి నటిస్తూ ఉంటారు.కొంతమంది పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోతూ ఉంటారు.
అయితే ఇదే విషయాన్ని మన టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ( Tollywood heroine Keerthy Suresh )కాస్త ఆలస్యంగా తెలుసుకుంది.ఎందుకంటే కెరియర్ మొదట్లో కీర్తి సురేష్ స్కిన్ షోకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాల ఆరబోతతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఎక్స్‌ఫోజింగ్ ( Exposing )కి తాను కూడా రెడీ అంటోంది.సర్కార్ వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్ యాంగిల్ ని పరిచయం చేసింది.ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.ఈ సినిమా తర్వాత బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది.అలా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ ( Varun Dhawan )తో కలిసి బేబీ జాన్ సినిమాలో నటించింది.
అయితే బేబీ ఏం సినిమాలో ఆమె నటించిన సన్నివేశాల గురించి మనందరికీ తెలిసిందే.కానీ ఒకప్పుడు అంతకంటే తక్కువ రొమాన్స్ ఉన్న పాత్రలను సైతం కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట.

లిప్‌లాక్ సీన్ ఉందని నితిన్ మ్యాస్ట్రో సినిమాని( Maestro movie ) వదులుకుందట.ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్ గా కీర్తినే అనుకున్నారు.కానీ కథ మొత్తం విని లిప్‌లాక్ సీన్ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేనని చెప్పిందట.ఇది నాలుగేళ్ల కిందటి మాట.అదే ఇప్పుడు అయితే కీర్తి లిప్‌లాక్ సీన్ కి నో చెప్పేది కాదేమో.అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి.
రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగేది.ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది.
ఒకప్పుడు గ్లామర్ షో కి స్కిన్ షో కి నో చెప్పినా కీర్తి సురేష్ ఇప్పుడు తప్పక గ్లామర్ పాత్రలకు కూడా సై అంటోంది.